Site icon NTV Telugu

Nimmagadda Ramesh Kumar: ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తేడా ఉంది.. నన్ను ఓ పార్టీ ఏజెంట్ అనడం తప్పు..

Nimmagadda Ramesh Kumar

Nimmagadda Ramesh Kumar

Nimmagadda Ramesh Kumar: ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తేడా ఉంది.. నన్ను ఓ పార్టీ ఏజెంట్ అనడం తప్పు అన్నారు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ మాజీ ఎన్నికల కమిషనర్‌, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరపున గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశాం.. కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాం.. మా ఫిర్యాదును గవర్నర్ శ్రద్ధగా విన్నారు, సానుకూలంగా స్పందించారని తెలిపారు.. ఇక, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తేడా వుంది.. కానీ, నన్ను ఓ పార్టీ ఏజెంట్ అనడం తగదు అన్నారు.. సీఎఫ్‌డీ వేసుకునే కండువా ఓ పార్టీ కి చెందింది కాదన్న ఆయన.. ఒక్కరికీ ఒకే ఓటు వుండాలి అనే డిమాండ్‌ను మేం స్వాగతిస్తున్నాం అన్నారు. చాలా మందికి రెండు చోట్ల ఓట్లు అంశంలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందన్నారు.

Read Also: Italy: చైనాకు ఇటలీ బిగ్ షాక్.. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI) నుంచి ఔట్..

ఇక, గత ఎన్నికల ప్రక్రియలో తప్పులు జరగవు అనే నమ్మకం ఉండేది.. కానీ, ఇప్పుడు వార్డు, విలేజ్ సెక్రటేరియట్‌ల వారికి అనుభవం లేకపోవడం వల్ల తప్పు లు జరుగుతున్నాయన్నారు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌.. ఓటర్లకు సామాజిక స్పృహ ఉండాలన్న ఆయన.. తాజాగా జరిగి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో కేవలం 40 శాతం మాత్రమే ఓటింగ్ జరగడం దారుణం అన్నారు.. మరోవైపు, వేరే చోట ఉద్యోగం చేస్తుంటే సొంత ఊర్లలో ఓట్లు తొలగిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఓటు తీసేటప్పుడు నోటీస్ ఇవ్వాలి… సంజయిషి తీసుకోవాలి అని సూచించారు సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌. కాగా, రాజ్ భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసిన నిమ్మగడ్డ.. అధికార పార్టీ కార్యకలాపాలకు ప్రభుత్వం డబ్బు ఖర్చు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. నిమ్మగడ్డ.. ఆంధ్రప్రదేశ్‌లో సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరమ్‌ను ఏర్పాటు చేసి పౌరుల సమస్యలపై పోరాడుతున్నారు. నకిలీ ఓటర్ల జాబితాపై గతంలో గవర్నర్‌కు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ కార్యక్రమాలకు నిధులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.7ను జారీ చేసిందన్నారు.

Exit mobile version