Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ కోసం నెట్‌ఫ్లిక్స్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండటంతో ఆడియోపై భారీ అంచనాలు ఉన్నాయి. పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. అయితే ఇప్పుడు బాక్సాఫీస్ కంటే ముందే తన ఓటీటీ డీల్‌తో ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది.తాజా సమాచారం ప్రకారం ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా కోసం ఒక వినూత్నమైన ‘పర్ఫార్మెన్స్ బేస్డ్’ ఒప్పందాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం.
Also Read : VD15: ‘హాయ్ నాన్న’ డైరెక్టర్‌తో విజయ్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో సర్‌ప్రైజ్
Also Read
- YS Jagan: ‘హలో ఇండియా’ అంటూ జగన్ పోస్ట్.. కూటమి సర్కార్‌పై సంచలన ఆరోపణలు
- Ration Card: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఇంటికి రేషన్ కార్డు జారీ.. MRO ఏమన్నారంటే..
- Trump-Meloni: ట్రంప్-మెలోని మధ్య ముదిరిన ‘‘ఫోటో’’ వివాదం..
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్‌రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
సాధారణంగా ఒక సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అన్న దానితో సంబంధం లేకుండా రిలీజ్‌కు ముందే భారీ రేటుకు ఓటీటీ సంస్థలు రైట్స్ కొనేస్తుంటాయి. కానీ ‘స్వయంభు’ విషయంలో నెట్‌ఫ్లిక్స్ సరికొత్త రూల్‌ను తెరపైకి తెచ్చింది. ఏంటది అంటే ఈ సినిమా థియేటర్లలో ఎంత నెట్ కలెక్షన్ (Nett Collection) సాధిస్తుందో, అందులో సరిగ్గా సగం మొత్తాన్ని (50%) డిజిటల్ రైట్స్ కింద నెట్‌ఫ్లిక్స్ చెల్లిస్తుంది. అంటే సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు వసూలు చేస్తే, ఓటీటీ హక్కుల కోసం రూ. 50 కోట్లు దక్కుతాయి. ఒకవేళ వసూళ్లు రూ. 150 కోట్లు దాటితే, ఆ మేరకు ఓటీటీ రేటు కూడా భారీగా పెరుగుతుంది.
అంటే ఇది ఒక రకంగా నిర్మాతలకు డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ లాంటిది. కంటెంట్ మీద నమ్మకం ఉండి సినిమా బ్లాక్ బస్టర్ అయితే, ఊహించిన దానికంటే రెట్టింపు ఆదాయం వస్తుంది. అదే సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే ఓటీటీ ఆదాయం కూడా తగ్గుతుంది. ఇటీవల భారీ రేట్లకు కొన్న సినిమాలు ఓటీటీలో వ్యూస్ రాబట్టలేకపోతుండటంతో, తమ రిస్క్‌ను తగ్గించుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ఈ పద్ధతిని ఎంచుకుందట.
తాజావార్తలు
-
YS Jagan: ‘హలో ఇండియా’ అంటూ జగన్ పోస్ట్.. కూటమి సర్కార్‌పై సంచలన ఆరోపణలు
-
Murali Mohan: అంధ విద్యార్థుల మధ్య 61వ వివాహ దినోత్సవాన్ని జరుపుకున్న మురళీమోహన్
-
Ration Card: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఇంటికి రేషన్ కార్డు జారీ.. MRO ఏమన్నారంటే..
-
Trump-Meloni: ట్రంప్-మెలోని మధ్య ముదిరిన ‘‘ఫోటో’’ వివాదం..
-
Narahari Rao : బ్యాంక్ లాకర్ తెరిస్తే షాక్.. నరహరి దాచిన నోట్ల కట్టలు, కిలోల బంగారం.!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!