టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు.. గతంలో వచ్చిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఇక తాజాగా నిఖిల్ తండ్రి అయిన సంగతి తెలిసిందే.. ఆయన భార్య పల్లవి ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టడంతో నిఖిల్ సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి..
గత ఏడాది క్రితం నిఖిల్ తన తండ్రిని కోల్పోయారు.. ఇప్పుడు తన తండ్రే తనకు బిడ్డగా పుట్టాడని తెగ మురిసిపోయాడు.. తన కొడుకు అచ్చం తన తండ్రి లాగే ఉన్నాడని ఎమోషనల్ అయ్యాడు.. నిఖిల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తనకు కొడుకు పుట్టిన విషయాన్ని పంచుకున్నారు.. అయితే నిఖిల్ కొడుకుకు బారసాల వేడుక ఘనంగా జరిగింది.. దానికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ ఫోటోలను చూసిన అభిమానులు పేరు పెట్టారా? లేదా అని అడుగుతున్నారు.. ఆ ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు.. ఇకపోతే నిఖిల్, పల్లవి 2020వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.. వీరిద్దరిది ప్రేమ వివాహం.. ప్రేమించి, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. కార్తికేయ సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ప్రస్తుతం స్వయంభు అనే సినిమాలో నటిస్తున్నారు…