Site icon NTV Telugu

Niharika : బయటికి కనిపించడం లేదు కానీ గుండెల్లో బరువుని మోస్తున్నా..

Niharika Konidela

Niharika Konidela

నిహారిక కొణిదెల అంటే కేవలం నటి మాత్రమే కాదు, ఫిట్‌నెస్ క్విన్ కూడా. షూటింగ్స్, ప్రొడక్షన్ పనులతో ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యానికి ఆమె మొదటి ప్రాధాన్యత ఇస్తారు. జిమ్ వర్కవుట్స్, తండ్రి నాగబాబుతో కలిసి చేసే వాకింగ్ వీడియోలను అప్పుడప్పుడూ షేర్ చేస్తుంటుంది. అయితే, తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియోలో తన మనసులోని సంఘర్షణను బయటపెట్టారు.

Also Read : Bandla Ganesh : “ఈశ్వర.. పవనేశ్వర.. పవరే శ్వర!”.. బండ్లన్న భక్తికి శివాజీ ఫిదా!

“నా లోపల ఏదో తెలియని బరువును మోస్తున్నాను. అది ఒత్తిడి కావొచ్చు లేదా మరేదైనా కావచ్చు.. దాన్ని చెప్పడానికి నా దగ్గర పదాలు లేవు” అంటూ నిహారిక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారానికి కుంగిపోకుండా, దానికి బదులుగా తాను ముందుకు సాగడానికే మొగ్గు చూపుతున్నానని ఆమె తెలిపింది. ‘కొన్ని రోజులు జిమ్‌కి వెళ్లి ఆ బరువును ఎత్తుతాను, మరికొన్ని రోజులు వాకింగ్ లేదా యోగా చేస్తాను. బయటికి నేను మారినట్లు కనిపించకపోవచ్చు, కానీ నా లోపల మాత్రం మార్పులు మొదలయ్యాయి’ అని ఆమె రాసుకొచ్చారు. జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని వ్యాయామం ద్వారా ఎలా జయించవచ్చో ఆమె తన పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ, “మీరు చాలా స్ట్రాంగ్ నిహారిక” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version