Site icon NTV Telugu

Nicki Minaj: జేడీ వాన్స్ ‘హంతకుడు’.. అమెరికన్ రాపర్ నిక్కీ మినాజ్ అనుచిత వ్యాఖ్య

Nicki Minajjdvance

Nicki Minajjdvance

రాప్ స్టార్ నిక్కీ మినాజ్ నోరుపారేసుకున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఉద్దేశిస్తూ ‘హంతకుడు’ అంటూ సంబోంధించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆదివారం అరిజోనాలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ‌లో భాగంగా అమెరికా ఫెస్ట్ కన్వెన్షన్‌లో రాప్ స్టార్ నిక్కీ మినాజ్‌ను ఎరికా కిర్క్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా నిక్కీ మినాజ్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లను ప్రశంసిస్తూ నోరు జారారు. ఒకప్పుడు ట్రంప్‌ను విమర్శించిన ఆమె.. ఈసారి పొగడింది. అలాగే జేడీ వాన్స్‌ను కూడా ప్రశంసింది. యువకులకు ‘‘రోల్ మోడల్’’ అని తెలిపారు. అయితే ఈ క్రమంలో ‘హంతకుడు’ అంటూ సంబోధించింది. ఆ పదం ఉపయోగించగానే ఎరికా కిర్క్ ఒక కంటిపై చేయి వేసి కన్నీళ్లు తుడుచుకుంటున్నట్లు కనిపించింది. ఇంతలోనే నిక్కీ మినాజ్ తేరుకుని నోటిపై చేయి వేసుకుంది. హంతకుడు అన్న పదాన్ని సవరించుకుంది. ఇక నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను ఆమె ఖండించింది. పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

ఇది కూడా చదవండి: Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ నుంచి ట్రంప్ ఫొటోలు తొలగింపు! సమర్థించిన టాడ్ బ్లాంచే

సెప్టెంబర్ 10న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ మాట్లాడుతుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. భర్త మృతితో టర్నింగ్ పాయింట్ యూఎస్ కార్యక్రమాన్ని ఎరికా కిర్క్ చేపట్టారు. ఆ మధ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఆహ్వానించినప్పుడు ఇద్దరూ గట్టిగా కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవ్వడంతో రకరకాలైన వదంతులు వ్యాపించాయి. ఉషా వాన్స్‌-జేడీ వాన్స్ దంపతులు విడిపోతున్నారంటూ పుకార్లు నడిచాయి.

Exit mobile version