NIA: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ( ఎన్‌ఐఏ) 2022లో 73 కేసులను నమోదు చేసింది. ఇది 2021లో 61 కేసులు నమోదు కాగా.. 2022లో 19.67 శాతం పెరిగి 73 కేసులు నమోదయ్యాయి. ఇది ఎన్‌ఐఏకు ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. ఈ కేసుల్లో జమ్మూకశ్మీర్, అస్సాం, బీహార్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో 35 జిహాదీ టెర్రర్ కేసులు ఉన్నాయి. అందులో జమ్మూకశ్మీర్‌లో 11 కేసులు, 10 వామపక్ష తీవ్రవాద కేసులు, ఈశాన్య రాష్ట్రాల్లో ఐదు కేసులు, ఏడు పీఎఫ్ఐ సంబంధిత కేసులు, పంజాబ్ ఐదు కేసులు, గ్యాంగ్‌స్టర్- టెర్రరిజం మూడు కేసులు, తీవ్రవాద నిధుల కేసు, రెండు నకిలీ భారతీయ కరెన్సీ నోటు సంబంధిత కేసులు ఉన్నాయి.
Rishabh Pant: రిషబ్ పంత్ ఆరోగ్యంపై క్లారిటీ.. ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యులు
దర్యాప్తు సంస్థ 2022లో 368 మందిపై 59 చార్జిషీట్లు దాఖలు చేసింది. 19 మంది పరారీలో ఉండగా.. 456 మంది నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. బహిష్కరణపై ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 2022లో 38 ఎన్‌ఐఏ కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి, అవన్నీ నేరారోపణతో ముగిశాయి. 109 మందిని దోషులుగా కోర్టు నిర్ధారించగా.. కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించింది. 2022లో ఆరు జీవిత ఖైదులు కూడా విధించబడ్డాయి. మొత్తం నేరారోపణ రేటు 94.39 శాతం. ఇది కాకుండా, 2022లో ఉపా చట్టం కింద ఎనిమిది మంది వ్యక్తులను వ్యక్తిగత ఉగ్రవాదులుగా గుర్తించారు. వారిపై అవసరమైన చర్యలు ఎన్‌ఐఏ తీసుకుంటోంది.
