NTV Telugu Site icon

NHRC: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక.. ఏపీ సీఎస్‌, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ కీలక ఆదేశాలు

Nhrc

Nhrc

NHRC: తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సీరియస్‌ అయ్యింది.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.. సీనియర్ ర్యాంక్ అధికారితో విచారణ జరిపి “యాక్షన్ టేకెన్ రిపోర్టు” నాలుగు వారాల్లో పంపాలని స్పష్టం చేసింది ఎన్‌హెచ్‌ఆర్సీ.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో భౌతిక దాడులతో మానవ హక్కులకు భంగం వాటిల్లిన ఘటనపై స్పందించాలని డీజీపీని ఆదేశించింది.. హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ తగిన భద్రత ఎందుకు కల్పించలేదని డీజీపీని ప్రశ్నించింది జాతీయ మానవ హక్కుల కమిషన్‌.. ఎఫ్ఐఆర్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పేరు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది.. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు క్రమాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీకి నివేదించాలని స్పష్టం చేసింది.. అయితే, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన భౌతిక దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ఇటీవలే జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి.. దీంతో సీరియస్‌గా స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌.. ఏపీ సీఎస్‌, ఏపీ డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేసింది..

Read Also: Yashika Aannand : అయ్య బాబోయ్.. స్లీవ్ లెస్ లో సెగలు పుట్టిస్తున్న యాషిక