NTV Telugu Site icon

Next CM KTR Flexies: కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్.. కూకట్‌పల్లిలో ఫ్లెక్సీల హల్‌చల్‌

Ktr Flexies

Ktr Flexies

Next CM KTR Flexies: టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేక కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన తనయుడు, మంత్రి కేటీఆరే అవుతారని ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ నేతలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. ఇక ఆ పార్టీ ప్రకటనతో మంత్రి కేటీఆర్ నెక్స్ట్ సీఎం అవడం లాంఛనమైనట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ నేతలంతా గొంతెత్తి చాటుతున్నారు. ఇక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న కేటీఆర్‌కు కాబోయే సీఎం కేటీఆర్‌కు స్వాగతం అంటూ ఫ్లెక్సీలు స్వాగతం చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Revanth Reddy: మా మధ్య ఉన్నది తోడి కోడళ్ల పంచాయతీ.. ఎన్నో అనుకుంటాం ఆపై కలిసిపోతాం..

తాజాగా కూకట్‌పల్లిలో మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ.. టీఆర్ఎస్ శ్రేణులు పెట్టిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు స్వాగతం అంటూ కొందరు నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. కొన్ని నెలల క్రితం ఈ తరహాలోనే కేటీఆర్‌ ముఖ్యమంత్రి అంటూ జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత ఇందుకు ముగింపు పడింది. తిరిగి మళ్లీ ఇప్పుడు కేటీఆర్‌ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఫ్లెక్సీలు పెట్టడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు నగరంలో సాలు దొర.. సెలవు దొర అంటూ బీజేపీ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. అయితే, కేటీఆర్ మాత్రం కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయనే సీఎంగా ఉంటారని చెబుతున్నారు. అయితే, టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేటీఆర్ త్వరలోనే సీఎం అవుతారని భావిస్తున్నాయి.