NTV Telugu Site icon

Tollywood Heroes: నెక్స్ట్ వెయ్యి కోట్లు కొల్లగొట్టేది ఈ హీరోలే!

1000 Crore Club Telugu Movies

1000 Crore Club Telugu Movies

ఈ ఏడాదిలో తెలుగు నుంచి రెండు వెయ్యి కోట్ల సినిమాలొచ్చాయి. ‘కల్కి’తో ప్రభాస్ రెండో వెయ్యి కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకోగా.. ఇప్పుడు ‘పుష్ప 2’తో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి నెక్స్ట్ వెయ్యి కోట్ల హీరోల రేసులో రామ్ చరణ్‌, ఎన్టీఆర్ ఉన్నారనే చెప్పాలి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన చరణ్, తారక్.. సోలోగా వెయ్యి కోట్ల క్లబ్‌లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

‘దేవర’తో రూ.500 కోట్ల దగ్గరే ఆగిపోయాడు ఎన్టీఆర్. అయితే పుష్ప 2 జోష్ చూస్తే.. గేమ్ ఛేంజర్‌కు వెయ్యి కోట్ల ఛాన్స్ ఉంది. వచ్చే సంక్రాంతికి గేమ్ ఛేంజర్ రిజల్ట్ తేలిపోనుంది. కొడితే వెయ్యి, లేదంటే 500 కోట్లు ఈజీగా రాబట్టనుంది గేమ్ ఛేంజర్. ఇక ఇప్పటి వరకు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న 2025 సినిమాల లిస్ట్ తీస్తే.. వెయ్యి కోట్ల సినిమా ఏదనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ ‘రాజాసాబ్’ ఏప్రిల్‌లో ఉన్నప్పటికీ.. ఇది వెయ్యి కోట్ల బొమ్మ అయ్యే అవకాశాలు తక్కువ. కానీ ఎన్టీఆర్ మాత్రం మరోసారి పక్కాగా వెయ్యి కోట్ల సినిమాను తన అకౌంట్‌లో వేసుకోబోతున్నాడు. అయితే ఈసారి కూడా మరో హీరోతో కలిసి వెయ్యి కోట్ల సినిమా ఇవ్వబోతున్నాడు టైగర్. హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవైటేడ్ మల్టీస్టారర్ మూవీ ‘వార్ 2’ పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. అటు నార్త్, ఇటు సౌత్‌లో ఈ సినిమాపై హ్యూజ్ బజ్ ఉంది. 2025 ఆగష్టులో వార్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ కొడితే ఈ సినిమానే వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది.

Also Read: Gold Price Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధర!

వార్ 2 తర్వాత కూడా ఎన్టీఆర్‌కే వెయ్యి కోట్ల బొమ్మ పడేలా ఉంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2026 సంక్రాంతికి ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కానుంది. నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమా వెయ్యి కోట్లు ఈజీగా రాబట్టనుంది. ఇక ఆ తర్వాత రాబోయే సినిమాల్లో.. సలార్ 2, కల్కి 2, స్పిరిట్ ఈజీగా వెయ్యి కోట్లు కొల్లగొట్టడం ఖాయం. కానీ 2025లో మాత్రం చరణ్‌, ఎన్టీఆర్‌కే వెయ్యి కోట్ల ఛాన్స్ ఉంది. మరి గేమ్ ఛేంజర్, వార్ 2 ఏం చేస్తాయో చూడాలి.

Show comments