Chennai: చెన్నైలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వివాహం జరిగి కేవలం 9 రోజులు మాత్రమే గడవకముందే భార్య హత్యకు గురి కాగా, అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుండ్రత్తూరు సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం విజయ్, యువశ్రీ దంపతులు ఇద్దరూ ఒకే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. అదే కంపెనీలో పరిచయం కాస్త ప్రేమగా మారి ఇటీవలే వీరి వివాహం జరిగింది.
స్మార్ట్‌వాచ్‌తోనే షాపింగ్ పేమెంట్స్.. బోట్ ‘వేవ్ ఫార్చ్యూన్’ ధమాకా ఫీచర్లు..!
అయితే గత రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ గొడవ కోపానికి దారి తీసి, భర్త విజయ్ భార్య యువశ్రీని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం విజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై యువశ్రీ చెల్లెలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దంపతుల మధ్య తగాదాలే ఈ విషాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నారు.
Maruti eVX vs Hyundai Creta EV.. రేంజ్, ఫీచర్ల పరంగా ఏ ఎలక్ట్రిక్ SUV బెస్ట్?
