Site icon NTV Telugu

UP: పెళ్లయిన 50 రోజులకే ప్రియుడితో జంప్.. లస్సీలో మత్తు మందు కలిపి..

Up News

Up News

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హాపూర్ జిల్లాలోని సిటీ కొత్వాలి ప్రాంతం సారవా గ్రామంలో ఓ నూతన వివాహిత తన ప్రియుడితో కలిసి పారిపోయింది. వివాహం జరిగిన దాదాపు 50 రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్య లక్షల విలువైన నగలు, నగదుతో పారిపోయిందని భర్త ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నూతన వివాహితను పట్టుకున్నారు. ఆమెను కుటుంబీకులకు అప్పగించారు.

READ MORE: Strait of Hormuz: “హార్మూజ్ జలసంధి”ని మూసేయాలని ఇరాన్ ప్లాన్.. ఇదే జరిగితే చమురు సంక్షోభం..

అసలు ఏం జరిగిందటే..?
సారావా గ్రామంలో నివసించే సల్మాన్ వడ్రంగి పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 25న లోనీ నివాసి అయిన సనా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మే 13 రాత్రి సనా కుటుంబీకులకు లస్సీని అందించింది. లస్సీ తాగిన తర్వాత అందరూ స్పృహ తప్పి పడిపోయారు. ఉదయం 7:00 గంటల ప్రాంతంలో.. పొరుగువారు తలుపు తెరిచి వారిని నిద్రలేపారు. సల్మాన్ భార్య కనిపించడం లేదని, ఇంట్లో ఉన్న రూ.44,500 నగదు, లక్షల విలువైన నగలు కూడా పోయాయని వారు గుర్తించారు.

READ MORE: Telangana: విద్యార్థులకు గుడ్న్యూస్.. ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు లేనట్లే..!

ఆ కుటుంబం ఆ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేసింది. అందులో సనా రాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఓ యువకుడితో బైక్ పై వెళ్తున్నట్లు కనిపించింది. దీని ఆధారంగా.. సనా లస్సీలో మత్తు పదార్థాలు కలిపి తాగించి, ఆపై తన ప్రేమికుడితో పారిపోయిందని కుటుంబ సభ్యులు అనుమానించారు. వివాహిత కుటుంబాన్ని సంప్రదించినప్పటికీ.. సరైన సమాధానం రాలేదు. దీంతో ఆ కుటుంబం హాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి హాపూర్ కొత్వాలిలో కేసు నమోదు చేసి, సనాను పట్టుకున్నారు. ఆమె భర్తతో వెళ్ళడానికి నిరాకరించింది. దీంతో పోలీసులు సనాను ఆమె బంధువులకు అప్పగించారు.

Exit mobile version