NTV Telugu Site icon

Burnt Alive: కారులో చెలరేగిన మంటలు.. నూతన వధూవరులతో పాటు నలుగురు సజీవదహనం

Fire

Fire

Burnt Alive: మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఓ చెట్టును ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణించిన నూతన వధూవరులతో సహా సహా నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. .ఒక కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు పెళ్లికి హాజరై కారులో తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారు ఒక చెట్టును వేగంగా ఢీకొంది. దీంతో ఆ కారులో మంటలు చెలరేగాయి.

అందులో ఉన్న ఒక మహిళ, ముగ్గురు మగవారు మంటలంటుకున్న కారు నుంచి బయటకు రాలేకపోయారు. దీంతో వారు మంటల్లో కాలిపోయి సజీవ దహనమయ్యారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఫైరింజిన్‌తో సహా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఒక మహిళతోసహా నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.పెళ్లైన కొత్త దంపతులు కూడా మృతుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read Also: Man Stabs Daughter: దారుణం.. కన్నకూతురినే 25 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..

ఈ తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. “హర్దా జిల్లాలో కారు వేగంగా చెట్టుపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు పురుషులు, ఒక మహిళ సజీవ దహనమయ్యారు. వారు పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు” అని పోలీసు అధికారి తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన జంటకు ఆరు నెలల క్రితమే వివాహమైందని తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

గత వారం మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో స్లీపర్ బస్సు ట్రాలీని ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. అహ్మదాబాద్‌కు వెళుతున్న బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది

Show comments