Site icon NTV Telugu

Uttar Pradesh: ప్రధాని పేరు చెప్పకపోవడంతో వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకున్న వధువు

Up

Up

పెళ్లింట వధువు వరుడిని దేశ ప్రధాని ఎవరో చెప్పమని ప్రశ్నించింది. దానికి వరుడు సమాధానం చెప్పలేకపోవడంతో వధువు తన పెళ్లిని రద్దు చేసుకుని వరుడి తమ్ముడిని పెళ్లాడింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఈ షాకింగ్‌ ఘటన యూపీలోని ఘాజీపూర్‌ జిల్లా సైద్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గత శనివారం జరిగింది.

Read Also: Anil Ravipudi : బాలయ్య తర్వాత నెక్స్ట్ సినిమా ఏ హీరోతో తీస్తున్నారో తెలుసా?

సైద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాసిర్‌పూర్ గ్రామానికి చెందిన రామ్ అవతార్ కుమారుడైన శివశంకర్‌కు కరంద పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంత్ పట్టి గ్రామానికి చెందిన లఖేడు రామ్ కుమార్తె రంజన అనే యువతితో జూన్‌ 11న వివాహం జరిగింది. వీరికి 6 నెలల క్రితం పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అయితే అప్పటి నుంచి వారిరువురు మొబైల్‌ ఫోన్ ద్వారా మాట్లాడుకునేవారు. పెళ్లి తర్వాత జూన్‌ 12న వధువు ఇంట నిర్వహించిన ఓ కార్యక్రమంలో శివశంకర్‌ను మరదలు, బావమరిది సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగారు.

Read Also: IIT Bombay: తాను చదువుకున్న ఐఐటీకీ రూ. 315 కోట్ల విరాళం

అందులో భాగంగా భారత దేశ ప్రధాని ఎవరు అతని పేరు చెప్పమని మరదలు అడిగింది. అయితే శివశంకర్‌ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పేరు చెప్పలేకపోయాడు. దీంతో వధువు తరపు బంధువులు అతన్ని హేళన చేసి, మందబుద్ధిగా భావించారు. దీన్ని అవమాన భారంగా భావించిన వధువు రంజన.. శివశంకర్ తో తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని, అతని తమ్ముడైన అనంత్‌ను అక్కడికక్కడే వివాహం చేసుకుంది. తన కంటే వయసులో చిన్నవాడైన అనంత్‌ను కోడలు వివాహం చేసుకోవడాన్ని ఆమె మామ రామ్‌ అవతార్‌ అభ్యంతరం తెలిపాడు. వధువుతో చిన్న కొడుకును కాపురానికి పంపడానికి అతను నిరాకరించాడు. ఈ విషయంపై అతను స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది.

Exit mobile version