Site icon NTV Telugu

Extra Marital Affair: పెళ్లైన నాలుగు నెలలకే.. భర్త నలుగురు పిల్లల తల్లితో సంబంధం పెట్టుకున్నాడని.. భార్య ఏం చేసిందంటే?

Bihar

Bihar

ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. భార్యాభర్తలు ఒకరిని ఒకరు చంపుకోవడం.. ఆత్మహత్యలకు పాల్పడతున్నారు. తాజాగా బీహార్‌లోని ముంగేర్ జిల్లాలోని తారాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లైన నాలుగు నెలలకే కొత్తగా పెళ్లైన మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని మహ్‌పూర్ నివాసి జితేంద్ర తంతి కుమార్తె మౌసమ్‌గా గుర్తించారు. భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు బలవంతం చేశారని మృతురాలి కుటుంబం ఆరోపించింది.

Also Read:Sudan Landslide: సూడాన్‌లో విరిగిపడిన కొండచరియలు.. శవాల దిబ్బగా మారిన గ్రామం.. 1,000 మంది మృతి

సమాచారం ప్రకారం, మౌసమ్ అనే మహిళ మే 5న లౌనా గ్రామానికి చెందిన అజయ్ తంతి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం జరిగినప్పటి నుంచి, భర్త అజయ్ నలుగురు పిల్లలకు తల్లి అయిన తన అత్తతో అక్రమ సంబంధంలో ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. అజయ్ తన అత్తను విడిచిపెట్టనని బహిరంగంగా చెప్పాడు. అజయ్ వివాహితను కొట్టేవాడని, కట్నం కూడా డిమాండ్ చేసేవాడని కుటుంబం ఆరోపించింది.

Also Read:SBI Cashier Scam: కంత్రీ క్యాషియర్.. నోట్ల కట్టలతో బెట్టింగ్ ఆటలు

పెళ్లి సమయంలో రూ. 6 లక్షల కట్నం ఇచ్చామని అయినా అదనపు కట్నం కోసం వేధించారని తెలిపారు. మృతురాలి తల్లి బబితా దేవి మాట్లాడుతూ, అల్లుడు అజయ్ నా కూతురుని ఆత్మహత్యకు ప్రేరేపించాడని.. వేధింపులు భరించలేకనే మౌసమ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Exit mobile version