NTV Telugu Site icon

Akhanda 2 Thandavam : ఆ సినిమాలో బాలయ్య ఎంట్రీ సీన్ కోసం భారీ బడ్జెట్ తో స్పెషల్ సెట్

Akhanda2

Akhanda2

Akhanda 2 Thandavam : టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రం ‘అఖండ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 2021లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ‘అఖండ 2’ చిత్రానికి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం చైనీస్ వ్యక్తిని ఎంపిక చేస్తారని భావిస్తున్నారు.

Read Also:Chiru Odela Project : చిరు – ఓదెల ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డే్ట్.. ఇది కదా కావాల్సింది

మొదటి సినిమాకు మించి అఖండ 2 సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అఖండ విజయాన్ని మించి అఖండ 2 సాధిస్తుందని యూనిట్ నమ్మకంగా చెబుతోంది. దీంతో ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారంటూ బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. బోయపాటి శ్రీను ఇప్పటికే ‘అఖండ 2’కు స్క్రిప్ట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ పై కసరత్తులు చేస్తున్నారు. కాగా ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది. మరోవైపు లొకేషన్స్ ను కూడా ఇప్పటికే బోయపాటి ఫైనల్ చేశాడు. జనవరి మూడో వారం నుంచి ఆఖండ పాత్రకు సంబంధించిన ఎంట్రీ సన్నివేశాలను తెరకెక్కిస్తారట. ఇందులో భాగంగానే బాలయ్య ఇంట్రో కోసం ప్రత్యేకంగా ఓ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also:PKL 2024 Final: నేడు ప్రొ కబడ్డీ ఫైనల్ మ్యాచ్.. టైటిల్ పోరులో పాట్నా, హర్యానా..

ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ తో డబుల్ హ్యాట్రిక్ కు బాటలు వేయాలని బోయపాటి ప్రయత్నిస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే బోయపాటి ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Show comments