NTV Telugu Site icon

Vijayawada Crime: బీటెక్‌ స్టూడెంట్‌ హత్య కేసులో కొత్త ట్విస్ట్‌.. వెలుగులోకి సంచలన విషయాలు

Crime

Crime

Vijayawada Crime: విజయవాడలో సంచలనం సృష్టించిన బీటెక్‌ స్టూడెంట్‌ జీవన్ హత్య కేసులో మరో ట్విస్ట్‌ వచ్చి చేరింది.. జీవన్ హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి.. పెదపులిపాకకి చెందిన యువతితో జీవన్ కు ప్రేమ వ్యవహారం ఉందని బయటకు పొక్కింది.. నిన్న అర్థరాత్రి జీవన్ పెదపులిపాక వెళ్ళటానికి కారణం యువతేనా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. యువతి నివసించే ప్రాంతం సమీపంలోనే జీవన్ మృతదేహం లభ్యం కావడంతో ఈ దిశగా దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

Read Also: Karnataka assembly elections Live Updates: కొనసాగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

ఇప్పటికే యువతిని ప్రశ్నించారు పోలీసులు.. జీవన్ నిన్న రాత్రి తనకు ఫోన్ చేయలేదని, తనకు సంబంధం లేదని పోలీసులకు ఆ యువతి చెప్పినట్టుగా తెలుస్తోంది.. అయితే, యువతి ఫోన్, జీవన్ ఫోన్ కాల్ లిస్ట్ ట్రాక్ చేసే పనిలో పడిపోయారు పోలీసులు.. నిన్న అర్థరాత్రి 1 గంటకి జీవన్ తన తండ్రి సుధాకర్ కి ఫోన్ చేసి ఇక నేను తిరిగి రాను అని చెప్పినట్టు సమాచారం.. స్నేహితుడు రాజమండ్రి సాయికి చెందిన యాక్టివాపై వెళ్ళి విగతజీవిగా మారిపోయాడు జీవన్.. ఈ కేసును తేల్చేపనిలో ఉన్న పోలీసులు.. యువతిని, జీవన్ స్నేహితులను కూడా విచారిస్తున్నారు.. కాగా.. కృష్ణా జిల్లా వల్లూరు పాలెంకు చెందిన జీవన్ కుమార్ విజయవాడ మాచవరం ప్రాంతంలో ఉంటున్నాడు. గత రాత్రి శ్యామ్ అనే తన స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా అతను ఇచ్చిన పార్టీకి వెళ్లాడు.. ఆ తర్వాత పెదపులిపాక పంట పొలాల్లో మృతదేహంగా కనిపించాడు. పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆనవాళ్లు గుర్తించారు పోలీసులు.

Show comments