Site icon NTV Telugu

Andhra University: ఏయూ ప్రొఫెసర్‌ లైంగిక వేధింపుల్లో కొత్త ట్విస్ట్..!

Au

Au

Andhra University: ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ సత్యనారాయణపై లైంగిక వేధింపుల ఆరోపణ వచ్చిన విషయం తెలిసిందే కాగా.. హిందీ ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత మీడియా ముందుకు బాధితురాలి భర్త వచ్చారు.. జాతీయ మహిళా కమిషన్, పోలీసులు, యూనివర్శిటీ విచారణ జరుపుతోందని.. మూడు నెలల క్రితం మేం ఫిర్యాదు చేశామన్నారు.. ఇక, దురుద్దేశపూర్వకంగా ప్రొఫెసర్ సత్యనారాయణ ప్యానెల్ ఇవ్వ కుండా అడ్డుకుంటున్నారు.. అర్హత లేకుండా యూనివర్శిటీలో నియామకం, పీహెచ్‌డీ అడ్మిషన్లలో అక్రమాలు సహా ప్రొఫెసర్ సత్యనారాయణ చేస్తున్నవి నిరాధారమైన ఆరోపణలు అని కొట్టిపారేశారు. ఈ వ్యవహారంలో మీడియా ప్రమేయం అనవసరం, ఇది పూర్తిగా చట్టబద్ధంగా జరుతున్న విచారణ. యూనివర్సిటీ అధికారులు మాత్రమే సమాధానం చెప్పాలి అని బాధితురాలి భర్త ఉజ్వల్ ఘటక్ డిమాండ్‌ చేశారు.

అయితే, ఉజ్వల్‌ ఘటక్‌ అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా ఈ వ్యవహారాలన్నీ యూనివర్సిటీ అధికారులు నడుపుతున్నారని ప్రొఫెసర్‌ ఆరోపించారు. డిఫెన్స్ లిక్కర్ వ్యాపారం చేస్తూ యూనివర్సిటీ అధికారులను ఉజ్వల్ చెప్పుచేతల్లో పెట్టుకున్నాడని ఆరోపించారు. తన భార్యకు అర్హత లేకపోయినా ఫ్రీ పీహెచ్‌డీ కోసం ఒత్తిడి తెచ్చారని, నిబంధనలకు విరుద్ధమని తిరస్కరించినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రొఫెసర్‌ సత్యనారాయణ ఆరోపించారు.. ఒక్కరోజు కూడా డిపార్ట్ మెంట్‌కు రాని మహిళపై లైంగిక వేధింపులు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

ఇక, రీసెర్చ్ స్కాలర్ పై లైంగిక వేధింపులు, పీహెచ్‌డీల అమ్మకాల ఆరోపణలపై ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణ మోహన్ విచారణ జరుపుతున్నారు.. ప్రొఫెసర్ పై వచ్చిన లైంగిక ఆరోపణలపై ప్రొసీజర్ ప్రకారం విచారణ చేశామన్న ఆయన.. ప్రాథమిక విచారణలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ వల్లే పరస్పరం విరుద్ధ ఆరోపణలు చేసుకుంటున్నారని తెలిపారు.. అయితే, వాస్తవ నివేదికను ఇవ్వమని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.. హిందీ యూనివర్సిటీ హెచ్‌వోడీ ప్రొఫెసర్ సత్యనారాయణ అనవసరంగా యూనివర్సిటీకి రుద్దుతున్నారని వ్యాఖ్యానించారు.. గతంలో ఎప్పుడూ ప్రొఫెసర్ సత్యనారాయణ ఇలాంటి ఆరోపణలు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారో విచారణ చేయిస్తాం.. కానీ, పీహెచ్‌డీలు అమ్ముకుంటున్నారన్నది అవాస్తవమని క్లారిటీ వచ్చారు రిజిస్ట్రార్ కృష్ణ మోహన్.

కాగా, ఏయూలో హిందీ విభాగం హెడ్‌, ప్రొఫెసర్‌ సత్యనారాయణపై రీసెర్చ్‌ స్కాలర్‌ సోనాలి ఘటక్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం విదితమే.. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌కు సోనాలి ఫిర్యాదు చేశారు.. ప్రీ – టాక్ వైవా కోసం రెండు లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు.. తన వద్ద నుంచి ఇప్పటికే రూ.75 వేలు తీసుకున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొనడం కలకలం రేపుతోంది.

Exit mobile version