Vizag Crime: మెడికో మృతి కేసులో కొత్త ట్విస్ట్.. అసలు విషయం వేరే ఉంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలో ఓ లాడ్జిలో మెడికో అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది.. కేరళకు చెందిన ఎంఎంబీఎస్ విద్యార్థిని రమేష్ కృష్ణ విశాఖలో ఆత్మహత్య చేసుకుంది.. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోటు కూడా రాసింది.. ఇక, అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాన్ని గుర్తించారు.. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు.. వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసులో పురోగతి సాధించినట్టు చెబుతున్నారు.. ప్రియుడుతో ఏర్పడ్డ మనస్పర్ధలే ఆత్మహత్యకు కారణంగా చెబుతున్నారు.. కాగా, ఈ నెల 23వ తేదీన విశాఖకు వచ్చిన మెడికో రమేష్ కృష్ణ(25).. అంతకు ముందే ఇండోర్ లో ఉన్న ప్రియుడుని కలిసి వచ్చినట్టు తెలుస్తోంది..
Read Also: Aditya L-1 Mission: సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో రెడీ.. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం
Also Read
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
అయితే, చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది రమేష్ కృష్ణ.. ఆమె స్వస్థలం కేరళ, త్రిశూర్ జిల్లా, వందనపల్లి మండలం.. చైనా వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిన రమేష్ కృష్ణ.. విశాఖపట్నం నుండి సింగపూర్‌కు కనెక్టింగ్ ఫ్లైట్ నేపథ్యంలో.. విశాఖలోని దాబా గార్డెన్ లోని ఓ లాడ్జిలో దిగింది.. అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది.. లాడ్జి గదిలో ఉరివేసుకొని వేలాడుతున్నట్టు యువతి మృతదేహాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.. ఇక, లోపల నుంచి గడియ పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం రావడంతో.. లాడ్జ్ నిర్వాహకుల సమాచారంతో తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు.. యువతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.. ఘటనా స్థలంలో మలయాళం భాషలో రాసుకున్న సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యం అయ్యింది. “జీవితంలో ఓడిపోయానని, తన చావుకు ఎవరూ బాధ్యులు కారంటూ” సూసైడ్ నోట్ లో రాసుకొచ్చింది యువతి.. మొత్తంగా ఇప్పుడు ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు గల కారణంగా చెబుతున్నారు విశాఖ పోలీసులు.
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..