NTV Telugu Site icon

New Rules For Chit Funds: చిట్స్ నిర్వహణలో కొత్త రూల్స్‌.. ఇకపై ఇలా చేయాల్సిందే..

Chit Funds

Chit Funds

New Rules For Chit Funds: చిట్స్ నిర్వహణలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇక నుంచి అంతా ఆన్ లైన్ విధానంలో లావాదేవీలు జరపాల్సి ఉంటుంది.. అందులో భాగంగా ఈ -చిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్‌ను ప్రారంభించారు మంత్రి ధర్మన ప్రసాదరావు.. ఈ చిట్స్ అనే ఎలక్ట్రానిక్‌ను రూపొందించింది ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలు.. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఏపీలో చిట్ ఫండ్ వ్యాపారం పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.. ఏపీ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఈ- చిట్స్ అనే ఎలక్ట్రానిక్ విధానం ప్రారంభిస్తున్నాం.. చందాదారులు అంతా ఈ- చిట్స్ ద్వారా తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో ఈ కొత్త విధానం ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు..

Read Also: Punjab Court: రూ.100 కోట్ల పరువు నష్టం కేసు.. మల్లికార్జున్ ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు

చిట్స్‌ వేసే చందాదారు మోస పోకుండా చూడాలనే ఈ విధానం అని పనిచేస్తుందన్నారు మంత్రి ధర్మాన.. కొత్త విధానం ప్రకారం అన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఆన్ లైన్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలించి ఆమోదం తెలియజేస్తారన్న తెలిపారు.. ఈ విధానం ద్వారా మాత్రమే ఇక నుంచి చిట్‌లు నిర్వహించాలి.. గతంలో నమోదు అయిన సంస్థలు క్రమంగా ఈ విధానంలోకి రావాల్సిందేనన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. కాగా, గత కొంత కాలంగా కొన్ని ప్రైవేట్‌ చిట్ సంస్థల్లో సీఐడీ సోదాలు కలకలం రేపాయి.. ఈ కేసులో కొందరిని సీఐడీ అధికారులు ప్రశ్నించిన విషయం విదితమే. చిట్స్‌ విధానంలోనే తప్పులు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.. దీంతో.. చిట్స్‌ నిర్వహణలో కొత్త విధానాన్ని రూపొందించింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.