December 1 New Rules: నవంబర్ నెల ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. అదే సమయంలో ఈ నెలాఖరుతో అనేక ముఖ్యమైన పనులకు గడువులు కూడా సమీపిస్తున్నాయి. ఈ పనులకు గడువు నవంబర్ 30 మాత్రమే. కాబట్టి అంతకు ముందే వాటిని పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఇంతకీ ఆ పనులు ఏంటి, ఏ రూల్స్ మారుతున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఏకీకృత పెన్షన్ పథకం (UPS) గడువు తేదీ..
ఏకీకృత పెన్షన్ పథకం (UPS) ఎంపిక చేసుకోవడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నవంబర్ 30వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా నవంబర్ 30లోపు UPS ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ గడువును మొదట సెప్టెంబర్ 30గా నిర్ణయించారు, కానీ తరువాత నవంబర్ 30 వరకు పొడిగించారు. UPS పథకం NPS నుంచి వేరుగా ఉంటుంది.
పన్ను సంబంధిత పనులకు గడువులు
అదేవిధంగా పన్ను సంబంధిత పనులకు చివరి తేదీ నవంబర్ 30. అక్టోబర్ 2025లో తగ్గించిన TDS కోసం, సెక్షన్లు 194-IA, 194-IB, 194M, 194S కింద స్టేట్‌మెంట్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ నవంబర్ 30. సెక్షన్ 92E కింద నివేదికలను దాఖలు చేయాల్సిన పన్ను చెల్లింపుదారులు నవంబర్ 30లోపు తమ ITRని దాఖలు చేయాల్సి ఉంది. NTTకి ఫారమ్ 3CEAAను సమర్పించడానికి కూడా చివరి తేదీ నవంబర్ 30.
లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి..
పెన్షనర్లు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30. మీ ఇంట్లో ఎవరైనా పెన్షన్ పొందుతుంటే, వారు ఈ గడువులోగా వారి జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని గుర్తు చేయండి.
LPG గ్యాస్ సిలిండర్
ప్రతి నెల లాగే, చమురు మార్కెటింగ్ కంపెనీలు డిసెంబర్ 1న LPG గ్యాస్ సిలిండర్ల ధరలను మార్చవచ్చు.
UIDAI ఆధార్ కార్డ్
ఆధార్ కార్డులో మార్పులను UIDAI పరిశీలిస్తోంది. కార్డులో ఫోటో, QR కోడ్ మాత్రమే ఉండాలి, మిగిలిన సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలి అనే నిబంధనను ఇందులో చేర్చవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: DGCA Emergency Advisory: విమానయాన సంస్థలకు DGCA అత్యవసర సలహా..