వికేత్రల మోసాలకు కూడా ఈ-కామర్స్ సంస్థలను బాధ్యులుగా చేసే విధంగా నిబంధనలకు కఠినతరం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. వాటిలో జవాబుదారీతనాన్ని మరింతగా పెంచేలా రూల్స్ ను రూపొందించడంపై వినియోగదారుల వ్వవహారాల శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి, మధ్యవర్తిత్వ సంస్థలుగా అవి పోషిస్తున్న పాత్ర గురించి తెలియజేయాలంటూ కొన్ని ప్రశ్నలను ఈ-కామర్స్ కంపెనీలకు కేంద్ర ఎలాక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పంపించింది. వాటికి సమాధానాలు వచ్చిన తర్వాత మార్గదర్శకాల రూపకల్పన ప్రారంభమవుతుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది.
Also Read : Amazon: వీడి డెడికేషన్ తగిలెయ్యా.. పోలీస్ ఆపరేషన్ మధ్య పార్సల్ ఇవ్వడం ఏంట్రా..వీడియో వైరల్
అమెజాన్, ప్లిప్ కార్ట్ లాంటి ఈ-కామర్స ప్లాట్ ఫామ్ లు సాధారణంగా విక్రేతల, కొనుగోలుదారులను అనుసంధానించే మధ్యవర్తిత్వ సంస్థలుగా వ్యవహిరిస్తున్నాయి. వీటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 79 ప్రకారం నిర్ఠిష్ట బాధ్యతల నుంచి కొన్ని మినహాయింపులు ఉంటున్నాయి. అయితే, ప్రతిపాదిత మార్పుల ప్రకారం దాన్ని మార్చి, మధ్యవర్తిత్వ సంస్థలుగా వాటికి మరింత జవాబుదారీతనాన్ని పెంచేలా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
Also Read : Tension in Osmania university: ఓయూలో ఉద్రిక్తత.. జేఏసీ నాయకుల అరెస్ట్
డిజిటల్ ఎకానమీలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేలా ఈ-కామర్స్ నిబంధనలను పునర్ వ్యవస్థీకరించే ప్రక్రియ చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ లలో విక్రయించే ఉత్పత్తులు లోపభూయిష్టంగా ఉన్నట్లు తేలితే.. ఆయా ఈ-కామర్స్ సంస్థలనే బాధ్యులను చేయాలని భావిస్తున్నట్లు వివరించాయి. ఈ-కామర్స్ సంస్థలో నమోదు చేసుకున్న విక్రేత నిర్లక్ష్యంగా వ్యవహరించి.. వినియోగదారులు ఆర్డర్ చేసిన ఉత్పత్తులు లేదా సర్వీసులను అందించడంలో విపలమైన సదరు ఆన్ లైన్ షాపింగ్ సంస్థే బాధ్యత వహించేలా నింబధనలు ఉండవచ్చని పేర్కొన్నాయి.