NTV Telugu Site icon

New record : పుస్తక విక్రయాల్లో సాహిత్య అకాడమీ కొత్త రికార్డు

Sahitya Akademi

Sahitya Akademi

New record : టెక్నాలజీ ఎంత అందుబాటులో ఉన్నా.. ఎన్ని కొత్త రకాల మొబైల్స్ మార్కెట్లోకి వచ్చినా పుస్తకాలు చదివేవారి సంఖ్య తగ్గడం లేదు. అందుకు తాత్కారణమే ఈ కథనం. పుస్తకాల అమ్మకంలో సాహిత్య అకాడమీ సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది రూ.18 కోట్ల 36 లక్షల విలువైన పుస్తకాలు అమ్ముడుపోయినట్లు ప్రకటించింది. ఇది సాహిత్య అకాడమీ చరిత్రలోనే రికార్డు అని స్పష్టం చేసింది. విశేషమేమిటంటే ఈ పుస్తకాల విక్రయంలో హిందీ, బాల సాహిత్యం ముందంజలో ఉన్నాయి.

సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.కె.కె. శ్రీనివాసరావు గత ఏడాది సాహిత్య అకాడమీ కార్యకలాపాల గురించి తెలియజేస్తూ.. కొంతకాలంగా సాహిత్య అకాడమీ పుస్తకాల విక్రయాలు అకస్మాత్తుగా పెరిగాయని అన్నారు. 2022 సంవత్సరంలో అకాడమీ 18.36 కోట్ల విలువైన పుస్తకాలను విక్రయించిందని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా సాహిత్య అకాడమీ శాఖలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి అందిన డేటా ఆధారంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం పుస్తకాల విక్రయంలో హిందీ పుస్తకాలు, బాలసాహిత్యం అత్యధికంగా ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. సాహిత్య అకాడమీ ఇతర భాషల్లో కూడా బాల సాహిత్య అవార్డులు పొందిన పుస్తకాలను ప్రచురిస్తోందని తెలిపారు. సాహిత్య అకాడమీ రెండేళ్ల క్రితమే బాలసాహిత్యం అనువాద పనులను ప్రారంభించింది.

Read Also: Dry Cough: పొడి దగ్గుతో నిద్ర పట్టట్లేదా.. పడుకునే ముందు ఇవి తీసుకోండి

కొన్నేళ్ల క్రితం వరకు సాహిత్య అకాడమీ పుస్తకాల వార్షిక విక్రయాల సంఖ్య కొన్ని లక్షల్లో ఉండేదన్నారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో ఒక్కసారిగా అమ్మకాలు పెరిగాయని ఆయన చెప్పారు. అయితే గత ఏడాది విక్రయాలు ఇప్పటి వరకు ఉన్న అన్ని గణాంకాలను బద్దలు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన ప్రపంచ పుస్తక ప్రదర్శనలో సాహిత్య అకాడమీ స్టాల్‌లో ప్రతిరోజూ రూ.1.25 నుంచి 1.5 లక్షల విలువైన పుస్తకాలు అమ్ముడవుతున్నాయని కార్యదర్శి తెలిపారు. ఇలా మొత్తం ప్రపంచ పుస్తక ప్రదర్శనలో దాదాపు రూ.15 లక్షల విలువైన పుస్తకాలు అమ్ముడుపోయాయి.

ప్రతి 19 గంటలకు కొత్త పుస్తకం
సాహిత్య అకాడమీ కార్యదర్శి మాట్లాడుతూ గత ఏడాది 460 కొత్త పుస్తకాలను అకాడమీ ప్రచురించిందని తెలిపారు. అకాడమీ ఇప్పటివరకు 6000 కంటే ఎక్కువ పుస్తకాలను ప్రచురించింది. అకాడమీ ప్రతి 19 గంటలకు ఒక పుస్తకాన్ని ప్రచురిస్తోందని చెప్పారు.

Show comments