NTV Telugu Site icon

Petrol-Diesel rates: భారత్ లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు.. లీటరు ఎంతో తెలుసా..?

Petrol

Petrol

ప్రస్తుతం దేశంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన లేదా తగ్గిన వాటి ధరలను నెక్ట్స్ డే ప్రకటిస్తారు. ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్ సహా చెన్నైలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రతి రోజు పెట్రోల్ డీజిల్ ధరలు సవరించిన లేదా మారకపోయినా ఉదయం 6 గంటలకు వెలువడుతాయి. అయితే వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యాట్ ఉంటుంది.

Read Also: Health tips: ఈ పూలతో కిడ్నీలో రాళ్లు మంచులా కరిగిపోతాయి..

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేట్ రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉండగా.. ముంబైలో లీటరు పెట్రోల్ రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. హైదరాబాద్ లో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ. 109.66. డీజిల్ ధర రూ. 97.82 లీటరు ఉంది.

Read Also: Kia Cars : భారతీయ మార్కెట్లోకి కియా కార్.. జస్ట్ రూ. 7 లక్షలకే కిరాక్ ఫీచర్స్..

మరోవైపు హిమాచల్ ప్రదేశ్, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో పెట్రోలు ధర 50 పైసలు, డీజిల్ ధర 49 పైసలు, బీహార్‌లో పెట్రోల్ ధర 27 పైసలు, డీజిల్ ధర 25 పైసలు పెరిగింది. ఇక.. మహారాష్ట్రలో పెట్రోల్ 52 పైసలు, డీజిల్ 50 పైసలు తగ్గింది. జార్ఖండ్‌లో పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 29 పైసలు, పశ్చిమ బెంగాల్‌లో కూడా పెట్రోల్ 46 పైసలు, డీజిల్ 43 తగ్గాయి.

Read Also: Hyundai Exter: హ్యుందాయ్ నుంచి SUV కారు..రూ. 10 లక్షలే.. ఫీచర్స్ అదిరిపోయాయి..!

భారతదేశంలో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. అలాగే రోజువారీ ప్రాతిపదికన చేయబడుతుంది.. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి. ప్రతి రోజు ధరలు కొత్తవి అయినా లేదా స్థిరంగా ఉన్న.. ఉదయం 6 గంటలకు ప్రకటించబడతాయి. అయితే ఇవి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

Read Also: Mahesh Babu: ఆల్ టైం రికార్డ్.. ‘గుంటూరు కారం’దే టాప్ ప్లేస్!

ఇది విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన ప్రమాణాల కారణంగా ఉంటుంది. 0020 GMT వద్ద బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 23 సెంట్లు లేదా 0.3శాతం తగ్గి బారెల్ $76.48 వద్ద ఉన్నాయి. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 25 సెంట్లు లేదా 0.4శాతం తగ్గి బ్యారెల్ $71.90కి చేరుకుంది.