NTV Telugu Site icon

Russia-North Korea: రష్యా- నార్త్ కొరియా మధ్య నూతన భాగస్వామ్య ఒప్పందం..

Russia North Korea

Russia North Korea

Russia-North Korea: ఉత్తర కొరియా- రష్యాల మధ్య నూతన భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్‌ పుతిన్, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బుధవారం సంతకాలు చేసేశారు. ఇది తమ మధ్య సంబంధాల్లో గొప్ప మైలురాయిగా ఇద్దరు దేశాధినేతలు తెలిపారు. రెండు దేశాల్లో దేనిపైనైనా శత్రువు దాడి జరిపితే ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవడంతో పాటు భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతికం, మానవీయ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని పేర్కొన్నారు.

Read Also: Klin Kaara : క్లింకారా ఫస్ట్ బర్త్ డే.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్..

అలాగే, వీటితో పాటు ఆరోగ్యం, వైద్య విద్య, సైన్స్‌ విభాగాల్లో ఇరు దేశాలు సహాకారం అందించుకునేలా పలు ఒప్పందాలను పుతిన్- కిమ్ జోంగ్ ఉన్ చేసుకున్నారు. పశ్చిమ దేశాలతో ఈ రెండు దేశాలకు ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో తాజా భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. కిమ్‌ ఆహ్వానం మేరకు ఉత్తర కొరియా పర్యటనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మంగళవారం రాత్రి ఆ దేశ రాజధాని ప్యాంగాంగ్‌కు వెళ్లారు. ఉత్తర కొరియా పర్యటన ముగిసిన తర్వాత వియత్నాంకు పుతిని తిరుగుపయనం అయ్యారు.

Read Also: Secunderabad Alpha Hotel: సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌లో ఫుడ్ టాస్క్‌ఫోర్స్ దాడులు.. వెలుగులోకి అసలు నిజాలు..!( వీడియో)

ఇక, వ్లాదిమిర్ పుతిన్‌ తన ఉత్తర కొరియా పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు కిమ్‌కు తమ దేశంలో అత్యంత విలాసవంతమైన ఆరస్‌ లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ సందర్భంగా కిమ్‌ కూడా పుతిన్‌కు పలు విలువైన బహుమతులను అందజేశారు. గత ఫిబ్రవరిలో కిమ్‌ మాస్కో పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఇలాంటి కారునే పుతిన్‌ ఆయనకు బహుమతిగా ఇచ్చాడు.