Site icon NTV Telugu

Covid Vaccine: గుడ్ న్యూస్.. నోటి మాత్రల రూపంలో కరోనా వ్యాక్సిన్

Corona Vaccine

Corona Vaccine

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని నివారించేందుకు శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ప్రజలు ఇంజక్షన్‌ల రూపంలో కరోనా వ్యాక్సిన్‌ను తీసుకుంటున్నారు. అయితే తాజాగా ట్యాబ్లెట్ రూపంలో కరోనా వ్యాక్సిన్‌ను సైంటిస్టులు కనుగొన్నారు. దీంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. కరోనా రోగుల నోటి నుంచి వెలువడే తుంపర్ల సంఖ్యను ఈ సరికొత్త టీకా గణనీయంగా తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు.

ఈ కరోనా మాత్ర వేసుకుంటే రక్తంలో, ఊపిరితిత్తుల్లోనూ యాంటీబాడీలను సమర్థంగా తయారుచేస్తుందని తమ పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు వివరించారు. అడినోవైరస్‌ను వాహకంగా ఉపయోగించుకునేలా ఈ టీకాను తాము అభివృద్ధి చేసినట్లు తెలిపారు. తద్వారా కరోనా వైరస్ నుంచి ఈ టీకా రక్షణ కల్పిస్తుందని సైంటిస్టులు పేర్కొన్నారు. ఇంజక్షన్ ద్వారా తీసుకునే టీకాతో పోలిస్తే ఈ నోటి టీకా ఇమ్యునోగ్లోబ్యులిన్-ఎను అధికంగా ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. కరోనా రోగులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్ల నుంచి వెలువడే వైరస్ కణాల సంఖ్యను తగ్గించడంలో ఐజీ-ఎ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

Blast: పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ ఆఫీస్‌లో పేలుడు

Exit mobile version