Site icon NTV Telugu

Minister Kollu Ravindra: త్వరలోనే నూతన మద్యం పాలసీ..

Kollu Ravindra

Kollu Ravindra

Minister Kollu Ravindra: త్వరలోనే నూతన మద్యం పాలసీని ప్రకటిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్‌ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం కుటుంభసభ్యులతో కలసి తిరుమల విచ్చేసిన కొల్లు రవీంద్ర.. ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశ్వీరదించగా.. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర.. రాష్ట్రాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధోగతి పాల్జేసిందని మండిపడ్డారు.. గత పాలకులు సాగించిన ఆరాచకాలను శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు వుంచుతున్నామని తెలిపారు.. ఇక, త్వరలోనే మద్యం మరియు ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేత పత్రాలను కూడా విడుదల చేయనున్నట్టు వెల్లడిండారు మంత్రి కొల్లు రవీంద్ర..

Read Also: Sikkim : పశ్చిమ బెంగాల్‌లోని కాలువలో దొరికిన సిక్కిం మాజీ మంత్రి మృతదేహం

మరోవైపు.. మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఐదు సంవత్సరాల పాటు స్వచ్ఛమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి రవీంద్ర.. గత పాలకులకు కొంత మంది అధికారులు వత్తాసు పలికి.. అవినీతిలో తమ వంతు పాత్ర పోషించాచారని .. వారందరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర.. కాగా, గత ప్రభుత్వ హయాంలో.. ప్రభుత్వమే వైన్‌ షాపులను నిర్వహించిన విషయం విదితమే.. ఇప్పటికే అదే విధానం కొనసాగుతుండగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి కొత్త లిక్కర్‌ పాలసీ తర్వాత మార్పులు జరగనున్నాయి. ప్రభుత్వ మళ్లీ పాత విధానాన్ని తీసుకొస్తుందా.. ? గత ప్రభుత్వాన్ని ఫాలో అవుతుందా చూడాలి.. ఇక, నకిలీ లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారనే విమర్శలు గత ప్రభుత్వంపై లేకపోలేదు.

Exit mobile version