Site icon NTV Telugu

IPhone 13: మెగా ఈవెంట్ ఆఫ్ ది ఇయర్‌లో ఐఫోన్‌ 13

Iphone 13

Iphone 13

new iphone 13 series mobile launched

\ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఐఫోన్ 13ని మెగా ఈవెంట్ ఆఫ్ ది ఇయర్‌లో విడుదల చేసింది. ఈ సిరీస్ కింద, కంపెనీ ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో మరియు ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లను విడుదల చేసింది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీలు 12-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. ఇందులో, మొదటి వైడ్ మరియు రెండవ అల్ట్రా వైడ్ యాంగిల్‌కు మద్దతు ఉంది. అదే సమయంలో, సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 12-మెగాపిక్సెల్ కెమెరా కూడా ఇవ్వబడింది. ఇదిలా ఉంటే.. తన యొక్క తదుపరి ఐఫోన్ 14 సిరీస్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేయనుంది.

 

అయితే అక్టోబర్ 2022 నెలలో ఆపిల్ సంస్థ మరొకకొత్త ఈవెంట్ ని నిర్వహించే అవకాశం ఉంది. ఐఫోన్ 14 సిరీస్ ప్రారంభమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొత్త ఐప్యాడ్ మోడళ్లను పరిచయం చేయడానికి సంస్థ మరో ఆపిల్ ఈవెంట్‌ను నిర్వహించాలని భావిస్తున్నారు. బడ్జెట్ ధర వద్ద ఆపిల్ సంస్థ కొత్త ఐప్యాడ్ లని విడుదల చేస్తూ ఆపిల్ సంస్థ దాని ఐప్యాడ్ పోర్ట్‌ఫోలియోను అప్ డేట్ చేయనున్నట్లు పుకారు ఉంది. కొన్ని నివేదికల ప్రకారం M2 చిప్‌తో కూడిన కొత్త ఐప్యాడ్ ప్రో మోడల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొనిరావాలని చూస్తున్నది. అయితే విడుదలకు ముందే ఐప్యాడ్ యొక్క స్పెసిఫికేషన్‌ల వివరాలు లీక్ అయ్యాయి.

 

Exit mobile version