Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఆరు దశాబ్దాల క్రితం నాటి 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో, కేంద్ర ప్రభుత్వం ‘కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025’ను అమల్లోకి తెచ్చింది. ఈ నూతన సంస్కరణలపై ప్రజల్లో, ముఖ్యంగా పన్ను చెల్లింపుదారుల్లో అవగాహన పెంచేందుకు ఐటీ విభాగం ‘మైగవ్’ (MyGov) పోర్టల్‌తో కలిసి ఒక వినూత్న క్విజ్ పోటీని నిర్వహిస్తోంది.
దీనిలో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ పోటీ మార్చి 20, 2025న ప్రారంభమైంది. ఏప్రిల్ 20, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 300 సెకన్ల వ్యవధిలో పూర్తి చేయాలి. నెగెటివ్ మార్కులు ఉండవు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు భారీ నగదు బహుమతులు ఉంటాయి. మొదటి 10 మందికి రూ.10,000 చొప్పున అందిస్తారు. ఆ తర్వాత ప్రతిభ చూపిన 20 మందికి రూ. 5,000 చొప్పున.. మరో 50 మందికి రూ.3,000 చొప్పున నగదు అందుతుంది. అంతే కాకుండా.. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుంచి ఇ-సర్టిఫికెట్ లభిస్తుంది.
Also Read
Also Read:AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..
పాల్గొనే విధానం..
ఆసక్తి గల వారు MyGov పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి, క్విజ్ విభాగంలో ‘Income Tax Act 2025’ పోటీని ఎంచుకోవాలి. తక్కువ సమయంలో కచ్చితమైన సమాధానాలు ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. పన్ను వ్యవస్థలో వస్తున్న మార్పులను తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వం నుంచి నగదు పురస్కారం పొందేందుకు ఇది ఒక చక్కని అవకాశం. ప్రాంతీయ భాషల్లో అనువాద సమస్యలు ఉంటే ఆంగ్ల భాషా ప్రశ్ననే ప్రామాణికంగా తీసుకుంటారు.
తాజావార్తలు
-
Iran-Hormuz: హార్ముజ్‌పై ఇరాన్ పట్టు కోల్పోతోందా? కారణమిదేనా?
-
Monsoon Tips: వర్షాకాలంలో ఊరగాయలపై బూజు పట్టకుండా.. ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి..!
-
YS Jagan: ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం.. మరో ఏడాదిలో పాదయాత్ర..
-
Film Federation: ఆ 20 శాతం వాటా ఇవ్వాల్సిందే.. బడా నిర్మాతలకు అల్టిమేటం!
-
Telugu Film Federation: జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ ఊహించని షాక్.. మళ్లీ సస్పెన్షన్ వేటు!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!