NTV Telugu Site icon

AP Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు

Ap Pensions

Ap Pensions

AP Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా రెండు నెలలు పింఛన్లు తీసుకోకున్నా మూడో నెలలో పింఛన్ పంపిణీ చేసేలా.. మొదటి రెండునెలలు పింఛన్ తీసుకోకున్నా మూడో నెలలో మొత్తం కలిపి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. వరుసగా మూడు నెలలు తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్లినట్టు భావిస్తూ పింఛన్ నిలిపివేయనున్నారు. ఈ నెల నుంచే ఈ గైడ్‌లైన్స్‌ జారీ చేశారు. ఇప్పటి వరకు ఒక నెలలో పింఛన్ తీసుకోకుంటే దాన్ని మళ్లీ ఇచ్చే వారు కాదు. ఏ కారణం చేతనైనా పింఛనుదారుడు ఒక నెలలో పింఛన్ తీసుకోకుంటే.. 2వ నెలలో బకాయితో పాటు పింఛన్ అందించనున్నారు.

Read Also: CM Chandrababu: రాష్ట్రంలో శాంతి భద్రతలే కీలకం.. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం..