శృంగారం అనేది ఒక ప్రకృతి చర్య ఆడ, మగల మధ్య జరిగే ఒక సహజ ప్రక్రియ.. అయితే శృంగారం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయానో… అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. గోనేరియా అనేది ఒక లైంగిక వ్యాధి. ఈ లైంగిక వ్యాధి ప్రమాదం ఎక్కువ మందితో సెక్స్ లో పాల్గొనే వారికే ఉంది.. ముఖ్యంగా 25 ఏండ్ల కంటే తక్కువ వయసున్న యువకులకు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
వివరాల్లోకి వెళితే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 82.4 మిలియన్ల మంది కొత్తగా గోనేరియా బారిన పడ్డారు. STI లపై గ్లోబల్ హెల్త్ సెక్టార్ స్ట్రాటజీ 2016-2021 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గోనేరియా ను 2030 కల్లా 90% తగ్గించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు ఈ వ్యాధి గురించి అసలు వైద్యులు ఏం చెబుతున్నారంటే.. గోనేరియా వ్యాధికారక నైస్సేరియా గోనోరియా వల్ల వస్తుంది. ఇది బ్యాక్టీరియా వల్ల కలిగే రెండవ అత్యంత సర్వ సాధారణమైన లైంగిక సంక్రమణ. ఇది జన నేంద్రియాలను, పురీషనాళం, గొంతు వ్యాధులకు కారణం అవుతుందట..
ఈ వ్యాధి లక్షణాలు :
మూత్ర విసర్జన సమయంలో నొప్పి,
విపరీతమైన యోని ఉత్సర్గ,
ఆడవారిలో పీరియడ్స్ మధ్య అసాధారణ ఉత్సర్గ,
రక్తస్రావం,
పురుషాంగం నుంచి పసుపు లేదా ఆకుపచ్చ ఉత్సర్గ,
పురుషాంగం వాపు,
వృషణాల నొప్పి,
ప్రేగు కదలికల్లో ఇబ్బంది..
ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొంటే ఈ వ్యాధి వస్తుంది..
తీవ్రత :
ఈ వ్యాధి జననేంద్రియ ప్రాంతాలతో పాటుగా పురీషనాళం, కళ్లు, గొంతు, కీళ్లకు కూడా గోనేరియా వస్తుంది. గోనేరియా సంకేతాలు వ్యాధి స్థానాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కళ్లలో.. ఇది కంటి నొప్పి, కాంతికి సున్నితత్వం, చీము లాంటి ఉత్సర్గకు కారణమవుతుంది.. ఇంకా జర్వం కూడా వస్తుంది.. అంతేకాదు ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.. సో బీ కేర్ ఫుల్..