Site icon NTV Telugu

Covid-19 Variant: వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్‌ వేరియంట్‌.. లక్షణాలు ఎలా ఉన్నాయంటే..?

Covid 19 Variant Nb.1.8.1

Covid 19 Variant Nb.1.8.1

Covid-19 Variant: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భారత్, చైనా, అమెరికా వంటి దేశాల్లో వెలుగులోకి వచ్చిన NB.1.8.1 అనే కొత్త కోవిడ్ వేరియంట్ ఇప్పుడు యునైటెడ్ కింగ్డంలో (UK) కూడా గుర్తించబడింది. ఈ వేరియంట్ కారణంగా చైనాలో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. ఇకపోతే,
శుక్రవారం ఉదయం వరకు భారత్‌లో 5,364 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 500 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా కేసులు కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో నమోదు అవుతున్నాయి.

Read Also: Preity Zinta: ఆశించినట్టు ముగియలేదు.. ఫైనల్ పరాజయంపై స్పందించిన ప్రీతీ జింటా..!

NB.1.8.1 వేరియంట్ ఒమిక్రాన్ కుటుంబానికి చెందినది. ఇది ఇతర ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల మాదిరిగానే వేగంగా వ్యాపించే లక్షణం కలిగి ఉంది. మార్చి చివరి నుంచి ఏప్రిల్ మొదటివరకూ అమెరికాలోకి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులలో ఈ వేరియంట్ మొదటగా గుర్తించబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని వేరియెంట్స్ అండర్ మానిటరింగ్ కింద మాత్రమే వర్గీకరించింది. కానీ, ఇది వేగంగా వ్యాపిస్తుండటంతో జాగ్రత్తలు తప్పనిసరి.

ఇకపోతే, ఈ వేరియంట్‌కి ప్రత్యేకమైన లక్షణాలు లేవు. సాధారణంగా మితంగా ఉండే లక్షణాలే ఉంటాయి. అయితే వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగినవారు తీవ్రమైన సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. జ్వరం, పొడిబారిన దగ్గు, గొంతునొప్పి, తలనొప్పులు, ఆకలి లేకపోవడం, శరీరంలో నొప్పులు, అలసట, రుచి కోల్పోవడం, వాసన కోల్పోవడం లాంటి వాటిని ఇప్పటివరకు లక్షణాలుగా గుర్తించారు.

Read Also: Israel- France: ఇజ్రాయెల్‌కు ఫ్రాన్స్ ద్రోహం.. ముస్లింలను చంపడానికి ఆయుధాలు ఇవ్వమని వెల్లడి

ఈ వేరియంట్ సాధారణంగా తీవ్రమైన వ్యాధిని కలిగించదని నిపుణులు చెబుతున్నారు. అయితే ముందుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, టీకా తీసుకోని వారు, వృద్ధులు ఇంకా రోగనిరోధక శక్తి తక్కువవారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. మొత్తంగా NB.1.8.1 వేరియంట్ గత వేరియంట్ల కన్నా తీవ్రమైన వ్యాధిని కలిగించకపోయినా, వ్యాప్తి వేగంగా ఉన్నందున జాగ్రత్తగా ఉండటం అత్యంత అవసరం. టీకాలు తీసుకోవడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే ఆరోగ్య నిబంధనలు పాటించడమే మన ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి.

Exit mobile version