Preity Zinta: ఆశించినట్టు ముగియలేదు.. ఫైనల్ పరాజయంపై స్పందించిన ప్రీతీ జింటా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Preity Zinta: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు పరాజయం చెందడంతో సహ యజమాని ప్రీతీ జింటా భావోద్వేగంగా స్పందించారు. జూన్ 3న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడిన పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ కు రెండో ఫైనల్ కాగా.. మళ్ళీ టైటిల్ గెలిచే అవకాశం చేజార్చుకోవడం బాధ కలిగించింది.
Read Also: Chevireddy Bhaskar Reddy: తుడా నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే రియాక్షన్..!
Also Read
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ జట్టు అద్భుతంగా ఆడింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించగా, 4 మ్యాచ్ లలో ఓడిపోయారు. మరో మ్యాచ్ ఫలితం రాలేదు. దీనితో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో జట్టు 19 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత జరిగిన క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిన పంజాబ్, క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు ప్రవేశించింది. కానీ చివరి మ్యాచ్‌లో మరోసారి ఓడి కప్ గెలవలేకపోయింది.
ఈ నేపథ్యంలో ప్రీతీ జింటా సోషల్ మీడియా వేదికగా తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా.. ఇది మనం కోరుకున్న విధంగా ముగియలేదు. కానీ, ప్రయాణం అద్భుతంగా సాగింది. ఉత్సాహంగా, ప్రేరణగా, థ్రిల్లర్ సాగిన ఈ సీజన్ మా యువ జట్టు చూపించిన పోరాటమే కాదు.. పట్టుదల కూడా అద్భుతం అంటూ రాసుకొచ్చారు. మా కెప్టెన్ ముందు నుంచి నాయకత్వం వహించడమే కాకుండా, అనుభవంలేని భారతీయ ఆటగాళ్లను కూడా ఈ ఐపీఎల్‌లో రాణించడానికి కృషి చేసాడని ఆమె పేర్కొన్నారు.
Read Also: Geeta Singh: సెకండ్ ఇన్నింగ్స్ మొదలెడుతున్న కితకితలు హీరోయిన్
అంతేకాకూండా.. ఈ సంవత్సరం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది.. మేము కొన్ని కీలక ఆటగాళ్లను గాయాలకు గురి అవ్వడం వల్ల వారి సేవలను కోల్పోయినా, టోర్నమెంట్ మధ్యలో నిలిచినా, హోం మ్యాచ్ లను ఇతర రాష్ట్రాలకు మార్చినా, స్టేడియాన్ని ఖాళీ చేసినా మేము ముందుకు సాగాం అంటూ రాసుకొచ్చారు. దశాబ్దం తర్వాత టేబుల్ టాప్‌లో నిలిచాం. ఫైనల్ వరకు ఫైటింగ్ ఇచ్చాం. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిపై నమ్మకం ఉంది. మా సపోర్ట్ స్టాఫ్‌కు, మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్, షేర్ స్క్వాడ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు.. మీ ఆదరణ వల్లే మేము ఇంత దూరం వచ్చాం. పని ఇంకా పూర్తి కాలేదు. వచ్చే సంవత్సరం మళ్ళీ స్టేడియంలో కలుద్దాం. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి. మీ అందరికీ ప్రేమతో… టింగ్! అంటూ తన సందేశాన్ని ముగించారు.
It didn’t end the way we wanted it to but….the journey was spectacular ! It was exciting, entertaining & it was inspiring. I loved the fight & the grit our young team, our shers showed throughout the tournament. I loved the way our captain, our Sarpanch lead from the front &… pic.twitter.com/kUtRs908aS
— Preity G Zinta (@realpreityzinta) June 6, 2025
తాజావార్తలు
-
Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
-
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!