కరోనా వైరస్ పేరు వినగానే గుండెల్లో గుబులు పుడుతుంది. గత సంవత్సరాలుగా ప్రపంచాన్ని వణికించిన ఈ కరోనా ప్రపంచ దేశాలకు నిద్ర పట్టుకుండా చేసింది. కరోనా ఉధృతితో పేద, ధనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీని బాధితులుగా మారారు. దీంతో ఇప్పుడిప్పుడే ప్రజలు సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఆలోపే మరో ప్రమాదం ముంచుకొస్తుంది. పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈజీ. 5 అనే వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అవుతుంది.
Read Also: Anirudh: ‘జైలర్’కే ఇలా ఉంటే దేవరకి ఇంకే రేంజులో కొడతాడో…
ఈ కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ తెగకు చెందినది. ఎక్స్‌బీబీ 1.9.2 స్ట్రెయిన్‌తో పోలిస్తే ఈజీ.5లోని స్పైక్ ప్రోటీన్‌లో అదనంగా ఒక మ్యూటేషన్ ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. శరీరంలోని కణాలకు వైరస్ సోకేందుకు స్పైక్ ప్రోటీన్ కీలకమన్నారు. అయితే ఈ కొత్త మ్యూటేషన్ ఇంతకు ముందు ఇతర కరోనా వేరియంట్లలో కూడా కనిపించిందన్నారు. మరోవైపు ఈజీ.5 నుంచి ఈజీ.5.1 అని పిలవబడే మరో కొత్త వేరియంట్ వచ్చింది. ఇది కూడా వేగంగా వ్యాపిస్తోంది.
Read Also: Virat Kohli Instagram Post: ‘కింగ్’ కోహ్లీతో అట్లుంటది మరి.. ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు!
XBB సిరీస్‌లోని ఇతర కరోనా వేరియంట్లతో పోలిస్తే ఇది రోగ నిరోధకవ్యవస్థ నుంచి మరింత సమర్థవంతంగా తప్పించుకుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే కొత్త వేరియంట్స్ వల్ల వ్యాధి తీవ్రతలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఈజీ.5 వేరియంట్ ఐర్లాండ్, ఫ్రాన్స్, యూకే, జపాన్, చైనాలలో కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. యూకేలో కరోనా కొత్త వేరియంట్ ఎరిస్ అనే పేరుతో రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోందని ఇంగ్లాండ్‌లోని వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించి దేశంలో దాదాపు 14.6శాతం కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
