ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే మోసం చేయటంతో పాటు వరకట్న వేధింపులకు గురి చేయటంతో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట రిక్షాపుల్లర్ కాలనీలో నివసించే తాళ్ళపల్లి రాజశేఖర్ ప్రస్తుతం అల్వాల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. తన ఇంటి వద్దే ఉన్న మనీషా(27) అనే యువతిని ప్రేమించటంతో, ఆ యువతి వారి ప్రేమ వ్యవహారాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. వారు వివాహం గూర్చి ప్రస్తావన పెద్దల వద్దకు తీసుకొని వెళ్ళటంతో రాజశేఖర్, అతని కుటుంబ సభ్యులు కోటీ రూపాయల కట్నం డిమాండ్ చేయగా, మనీషా కుటుంబ సభ్యులు 30 లక్షల కట్నం ఇచ్చేందుకు సమ్మతించారు. మరో యువతి తనను వేధిస్తోందని, వివాహం ఘనంగా వద్దని, ఆర్య సమాజ్ లో చేసుకుందామని రాజశేఖర్ సూచన మేరకు గత నెల 10వ తేదీన ఆర్యసమాజ్ లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం అవ్వగానే, రాజశేఖర్ తనను మోసం చేశాడని మరో యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
Harish Shankar: మీతో మరో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నా.. విశ్వప్రసాద్ కి హరీష్ శంకర్ ట్వీట్
జైలు నుండి విడుదల ఇంటికి వచ్చిన రాజశేఖర్, ఇంటికి తిరిగి వచ్చి మనీషా కట్న డబ్బులు తీసుకొని రావాలని వేధింపులకు గురి చేశాడు. వేధింపులు తాళలేక మనీషా ఈ నెల 11వ తేదీన యాసిడ్ తాగగా, ఆమె కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ఈ రోజు చికిత్స పొందుతూ మృతి చెందింది. మనీషా మృతి కారణమైన రాజశేఖర్, అతని తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ తమను ఎవరూ ఏమీ చేయలేరని, మీకు నచ్చిన చోట ఫిర్యాదు చేసుకోండి అని బెదిరింపులకు గురి చేస్తున్నారని మృతురాలి బంధువులు తెలిపారు. నిందితుల పై కఠిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు .
Himanta Biswa Sarma: భారత్లోకి బంగ్లాదేశీయులు ఎంట్రీపై అస్సాం సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
