ఆదిలాబాద్ బీజేపీలో నూతన చేరికల దుమారం చెలరేగింది. నిన్న బీజేపీలో గడ్డం నగేష్ చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బిఎల్ సంతోష్, లక్ష్మణ్ ని ఆదిలాబాద్ బీజేపీ నేతలు కలిశారు. బీజేపీలో నగేష్ చేరిక, లోక్ సభ స్థానాన్ని ఇవ్వడాన్ని ఆదిలాబాద్ బంజారా నేతలు రమేష్ రాథోడ్, రాథోడ్ బాపురావు(మాజీ ఎమ్మెల్యే) వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ.. పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న వారికి లోక్ సభ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరామని తెలిపారు. టికెట్ ఇస్తామని ఎవరికి హామీ ఇవ్వలేదు.. పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి న్యాయం చేస్తారని భావిస్తున్నామని పేర్కొన్నారు.
Read Also: Bode Prasad: రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి..
తెలంగాణలో 8 శాతం లంబడా, బంజారాలు ఉన్నారని.. లంబాడా, గోండు, బంజారాలు, గిరిజన జాతులు మొత్తం 3.5 లక్షల ఓట్లు ఉన్నాయని రమేష్ రాథోడ్ తెలిపారు. లంబడా, బంజారా ఓట్లు లక్షన్నర వరకు ఉన్నాయని.. ఆదిలాబాద్ లో లంబడా బంజారాలకు టికెట్ ఇస్తే గెలుస్తామని పేర్కొన్నారు. తమ జనాభా దృష్టిలో ఉంచుకుని టికెట్లు కేటాయించాలని కోరారు. తమకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది.. ఆదివాసీ జనాభా కన్నా లంబడా బంజారా జనాభా ఎక్కువ ఉందని అన్నారు. నగేష్ కి టికెట్ ఇవ్వొద్దు.. పార్టీలో ఎవరు వచ్చినా చేర్చుకుంటారు కానీ.. సీటు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. పార్టీ నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని రమేష్ రాథోడ్ తెలిపారు.
Read Also: Shopping Malls : మాల్స్‌లోని వాష్రూమ్స్ కు కస్టమర్స్ నో ఎంట్రీ.. కారణం ఏంటంటే?