Chinmayi Sripada: నా భర్త అలాంటి వాడు.. ట్రోలర్స్‌కు చిన్మయి స్ట్రాంగ్ వార్నింగ్
- సింగర్ చిన్మయి ఇన్‌స్టా స్టోరీపై నెటిజన్ల ట్రోలింగ్
- వీడియోలో స్పందించిన చిన్మయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinmayi Sripada: గాయని చిన్మయి శ్రీపాద గురించి పరిచయం అక్కర్లేదు. సింగర్ చిన్మయి తన పాటలతోనే కాకుండా పలు కాంట్రవర్సీలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సహా నటీమణులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తరచుగా స్పందిస్తూ ఉంటారు. అలానే పిల్లలపై ఎక్కడైనా వేధింపులు జరిగినట్లు తన దృష్టికి వచ్చినా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై పెద్ద చర్చే నడుస్తోంది. సింగర్ చిన్మయి ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. దీంతో తండ్రీకూతుళ్ల బంధాన్ని కూడా చిన్మయి తప్పుగా చూస్తుందంటూ ఆమెపై ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో మరోసారి ట్రోలర్స్‌కు వార్నింగ్ ఇస్తూ చిన్మయి వీడియోలు పోస్ట్ చేశారు. అసలు ఆమె ఏం పోస్ట్ చేసింది.. ఆ వివాదమేంటో తెలుసుకుందాం.
Read Also: Buddy: అల్లు శిరీష్”బడ్డీ” సినిమాకి స్పెషల్ ఆఫర్
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
చిన్మయి ఇన్‌స్టా పోస్ట్‌లో..”నా భర్త రాహుల్ రెండేళ్ల కూతురిని హగ్ చేసుకుందామనుకుంటే ఆమె నో చెప్పింది. అప్పటి నుంచి అతడు హగ్ చేసుకోవట్లేదు. నేను అందరు పిల్లలకు ఇదే నేర్పుతున్నా. బుగ్గలు గిల్లాలన్నా పేరెంట్స్ పర్మిషన్ తీసుకుంటా.” అని తెలిపారు. దీంతో రాహల్ వెంటనే “నేను నిన్ను హగ్ చేసుకోమని ఫోర్స్ చేయడం లేదమ్మా.. కానీ నాన్నకి నువ్వు అంటే చాలా ఇష్టం అది మాత్రం నువ్వు గుర్తుంచుకో” అంటూ తన కూతురికి చెప్పాడు. అలానే తనని మళ్లీ హగ్ చేసుకోవడానికి వెళ్లలేదు. ఇది నేను కూడా ఫాలో అవుతుంటాను. ఆరేడేళ్ల అమ్మాయి దగ్గరైనా సరే పర్మిషన్ లేకుండా కనీసం ఆమె బుగ్గ కూడా నేను గిల్లను. అలానే వాళ్ల పేరెంట్స్ పర్మిషన్ లేకుండా టచ్ కూడా చేయను.” అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు సింగర్ చిన్మయి. దీంతోనే అసలు రచ్చ మొదలైంది. చిన్మయి పెట్టిన పోస్టును పలువురు నెటిజన్లు తప్పుపట్టారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పడంలో తప్పులేదు కానీ తండ్రి హగ్ చేసుకున్నా ఇలా చేయడమేంటని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తండ్రి కూతుళ్ల బంధాన్ని కూడా చిన్మయి తప్పుగా చూడటం కరెక్ట్ కాదన్నారు.
దీంతో ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారు గాయని చిన్మయి శ్రీపాద. “తండ్రి కూతుళ్ల బంధం చాలా పవిత్రమైనంది. మీరు దాంట్లో కూడా సమస్యను వెతికి నన్ను ట్రోల్ చేస్తున్నారు. కానీ ఇది రాహుల్‌కు నేను చెప్పి చేయమన్నది కాదు. తనంతట తానే చేసిన పని. నా కూతురితో రాహుల్ అలా చెప్పిన తర్వాత చాలా మెచ్చుకున్నాను. రాహుల్ అలా చేయడం వల్ల తనపై ఉన్న గౌరవం కూడా పెరిగింది. మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. నాతో ఎవరైనా ఉండలేకపోతున్నారని అనిపిస్తే నేనే దూరంగా వెళ్లిపోతా. రాహుల్ విషయానికొస్తే అతను గొప్ప ఆల్ఫా మేల్.. మీలాంటి షిట్ కాదు.” అంటూ సింగర్ చిన్మయి ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు హీరోయిన సమంత ఓ కామెంట్ పెట్టారు. “ఖచ్చితంగా ఇది రాహుల్ లాంటి వ్యక్తి చేసి తీరతాడు” అంటూ సామ్ కామెంట్ పెట్టింది.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?