గాయని చిన్మయి శ్రీపాద గురించి పరిచయం అక్కర్లేదు. సింగర్ చిన్మయి తన పాటలతోనే కాకుండా పలు కాంట్రవర్సీలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సహా నటీమణులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తరచుగా స్పందిస్తూ ఉంటారు. అలానే పిల్లలపై ఎక్కడైనా వేధింపులు జరిగినట్లు తన దృష్టికి వచ్చినా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై పెద్ద చర్చే నడుస్తోంది.