ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో చెన్నై సూపర్ కింగ్స్ తమ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. హోంగ్రౌండ్ లో తమకు ఓడించడం అంత సులువు కాదని సీఎస్కే మరోసారి నిరూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ ఆర్ హెచ్ సీఎస్కే బౌలర్ల దాటికి పరుగులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం సీఎస్కే 18.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. డెవాన్ కాన్వే 77 పరుగులు నాటౌట్ గా నిలిచి జట్టును గెలిపించాడు.
Also Read : Eid Ul Fitr : నేడు రంజాన్.. ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
అయితే సన్ రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ వర్మ ( 34 ) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో జడేజా మూడు వికెట్లతో చెలరేగగా.. దేశ్ పాండే, ఆకాష్ సింగ్, పతిరానా తలా వికెట్ సాధించారు. అనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం మూడు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే ఛేదించింది. ఇదిలా ఉంటే.. ఎస్ ఆర్ హెచ్ టీమ్ లో కీలక ఆల్ రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. సీఎస్కేతో జరిగిన మ్యాచ్ లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన సుందర్ బౌలింగ్ లో కూడా ఒక్క వికెట్ పడగొట్టలేకపోయాడు.
Also Read : Al-Qaida : ప్రతీకారం తీర్చుకుంటాం.. భారత్ పై దాడి చేస్తాం : ఆల్ ఖైదా
తన హోంగ్రౌండ్ చెపాక్ లో కూడా అతడు పేలవ ప్రదర్శన కనబరచడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఈ ఏడాది సీజన్ లో ఇప్పటి వరకు 6 మ్యాచ్ లు ఆడిన సుందర్ కేవలం 36 పరుగులే చేశాడు. అదే విధంగా బౌలింగ్ లో అయితే అస్సలు రాణించలేకపోతున్నారు. 6 మ్యాచ్ ల్లో అతడు ఒక్క వికెట్ పడగొట్టకలేదు. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పేరుకే ఆల్ రౌండర్ తప్ప పొడిచింది. ఏమి లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సుందర్ స్థానంలో మరో ఆటగాడికి అవకాశం ఇస్తే బాగుంటుంది అని పలువురు మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడుతున్నారు.