Hardik Pandya-Mohammed Shami: హార్ధిక్ పాండ్యాకు థ్యాంక్స్.. సరైన సమయంలో గాయపడ్డాడు!
Netizens Trolls Hardik Pandya over Mohammed Shami: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ (117; 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (105; 70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత సెంచరీలతో పాటు మహమ్మద్ షమీ (7/57) సూపర్ బౌలింగ్‌తో భారత్ విజయం సాధించింది. 7 వికెట్స్ పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన షమీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో షమీ పేరు ట్రెండ్ అవుతోంది. అయితే అనూహ్యంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు కూడా నెట్టింట ట్రెండ్ కావడం గమనార్హం. హార్దిక్ సరైన సమయంలో గాయపడ్డావు, నీకు పెద్ద థ్యాంక్స్ అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
విషయం ఏంటంటే.. వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభంలో మహమ్మద్ షమీ ఆడలేదు. జట్టు సమీకరణల కారణంగా లీగ్ దశలోని మొదటి నాలుగు మ్యాచ్‌లలో షమీకి చోటు దక్కలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా గాయపడటంతో.. మూడో పేసర్ కోటాలో షమీకి తుది జట్టులో అవకాశం వచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 5 వికెట్లతో విజృంభించాడు. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సత్తాచాటిన షమీ.. తన ప్రదర్శన గాలి వాటం కాదని నిరూపించాడు. శ్రీలంకలపై ఐదు వికెట్స్ పడగొట్టాడు. ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్స్ తీసిన షమీ.. దక్షిణాఫ్రికాపై 2 వికెట్స్ పడగొట్టాడు.
Also Read: IND vs NZ: అప్పుడు తెలియదు.. రాత్రంతా మేల్కొని ఉన్నా: సత్య నాదెళ్ల
నెదర్లాండ్స్‌పై ఒక్క వికెట్ తీయని మహమ్మద్ షమీ.. కీలక సెమీస్ మ్యాచ్‌లలో సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఏకంగా 7 వికెట్స్ పడగొట్టి భారత జట్టుకు అద్భుత విజయం అందించాడు. కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లతో వన్డే ప్రపంచకప్ 2023లో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఒకవేళ హార్దిక్ పాండ్యా గాయపడకపోయి ఉండుటే.. కాంబినేషన్ల కారణంగా షమీకి తుది జట్టులో చోటు దక్కడం కష్టం అయ్యేది. అప్పుడు టీమిండియాకు ఎలాంటి విజయాలు వచ్చేవి కావేమో. అందుకే గాయపడి షమీ ఆడేందుకు అవకాశం కల్పించిన పాండ్యాకు ఫ్యాన్స్ థ్యాంక్స్ చెబుతున్నారు. హార్దిక్ సరైన సమయంలో గాయపడ్డాడు, చాలా థ్యాంక్స్, హార్దిక్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు.
Conspiracy theory : Hardik Pandya is actually all right.
Just that we discovered a deadly team combination because of his injury that the team management decided to keep him injured.
— The Kaipullai (@thekaipullai) November 15, 2023
Man of the tournament: Hardik Pandya.
— Anand Ranganathan (@ARanganathan72) November 15, 2023
Credit for today’s semi-final victory goes to Lord Hardik Pandya, who got injured at the right moment, allowing Mohammad Shami into the playing XI, and there has been no looking back for the Indian team since then.
Thank you, Pandya. We won’t forget this sacrifice.
— THE SKIN DOCTOR (@theskindoctor13) November 15, 2023
- Tags
తాజావార్తలు
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్డౌన్
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?