NTV Telugu Site icon

Umpire Richard Kettleborough: విరాట్ కోహ్లీ సెంచరీకి కారణం అంపైర్.. అతడికి మెడల్ ఇవ్వాలి!

Richard Kettleborough

Richard Kettleborough

Netizens Trolls Umpire Richard Kettleborough for Not Giving Wide in IND vs BAN Match: ప్రస్తుతం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బొరో పేర్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. విరాట్ సెంచరీకి అంపైర్‌ కెటిల్‌బొరో పరోక్షంగా సాయపడ్డాడని నెటిజన్స్ అంటున్నారు. క్లియర్‌ వైడ్‌ బాల్‌ అయినా ఇవ్వకుండా.. కోహ్లీ సెంచరీ చేసేందుకు సాయపడ్డాడు అని ట్రోల్స్ చేస్తున్నారు. ‘అంపైర్ రిచర్డ్‌ కెటిల్‌బొరోకి మెడల్ ఇవ్వండి’, ‘సెంచరీ చేసింది కోహ్లీ కాదు.. అంపైర్’, ‘అంపైర్ వైడ్ ఎందుకు ఇవ్వలేదో అర్థం కావడం లేదు’, ‘కోహ్లీ సెంచరీకి కారణం అంపైర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విషయం ఏంటంటే..

ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ విజయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ (103 నాటౌట్‌; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు. భారత్ విజయానికి రెండు పరుగులు అవసరం అయిన సమయంలో కోహ్లీ సిక్స్ బాది.. సెంచరీ మార్క్ అందుకున్నాడు. విరాట్ 97 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఉండగా.. బంగ్లా బౌలర్‌ నసుమ్‌ అహ్మద్‌ లైగ్‌ సైడ్‌ దిశగా వైడ్‌ బాల్‌ వేశాడు. కోహ్లీ కొంచెం పక్కకు తప్పుకోగానే.. బంతి అతని కాళ్ల వెనుక నుంచి కీపర్ చేతుల్లో పడింది.

Also Read: Leo Movie: పిచ్చి పీక్స్ అంటే ఇదే.. ‘లియో’ థియేటర్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విజయ్ ఫ్యాన్స్‌!

పరిమిత క్రికెట్‌లో ఆ బంతిని ఎవరైనా వైడ్‌ బాల్‌ అనే అంటారు. అయితే అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బొరో ఆ బంతిని వైడ్‌ బాల్‌గా ప్రకటించకుండా.. అలా చూస్తూ ఉండిపోయాడు. బంతి లెగ్‌ సైడ్‌ దిశగా వెళ్లగానే అంపైర్‌ వైపు కోహ్లీ దీనంగా చూశాడు. ఆపై అంపైర్‌ వైడ్‌ ఇవ్వలేదు. అనంతరం ఓ బంతిని వృధా చేసిన విరాట్.. 42వ ఓవర్‌ మూడో బంతికి సిక్సర్‌ బాది సెంచరీ పూర్తి చేశాడు. దాంతో విరాట్ సెంచరీ వైనాన్ని నెటిజన్స్ తప్పుపడుతున్నారు. విరాట్ వ్యతిరేకులు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు దిగారు.