NTV Telugu Site icon

Hardik Pandya: హార్దిక్‌ పాండ్యాపై నెటిజన్లు విపరీతమైన ట్రోల్స్..

Hardhik

Hardhik

క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లోకెక్కాడు. సింగర్-మోడల్ జాస్మిన్ వాలియాతో పాటు అతని పేరు ట్రెండింగ్‌లో ఉంది. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. కొందరు నెటిజన్లు ఇద్దరూ ఒకే దగ్గరుండి విహారయాత్ర చేస్తున్న ఫొటోలను గుర్తించారు. దీంతో.. వీరిద్దరు వైరల్ అయ్యారు. ఈ క్రమంలో నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. అయితే.. నెల క్రితం జనాలు హార్దిక్ పాండ్యా పట్ల సానుభూతి చూపుతూ నటాషా స్టాంకోవిచ్‌ను దుర్భాషలాడారు. కాగా.. ఇప్పుడు ఆ జనాలే ఆమెకు క్షమాపణలు చెబుతున్నారు.

Read Also: Cooker blast: బెంగళూర్‌లో కుక్కర్ పేలుడు.. ఉగ్రవాద కోణంలో దర్యాప్తు..

హార్దిక్‌పై ట్రోల్ చేస్తూ.. ‘మీరు క్రికెట్ లేదా సినిమాపై ఆసక్తి కలిగి ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే, హార్దిక్ పాండ్యా కొత్త ఎఫైర్ గురించి గాసిప్ మీకు తెలియాలి’.’ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ అధికారికంగా విడిపోయారు. ఇంతలో.. నటాషా సెర్బియాకు వెళ్లి తన కొడుకుతో గడుపుతుంది. జనాలలు ఆమెను చాలా తిట్టారు.’ ఇప్పుడు హార్దిక్ కొత్త వ్యవహారం చర్చనీయాంశమైంది. హార్దిక్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించలేదు, కానీ నెటిజన్లు మాత్రం హార్దిక్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Read Also: Bihar: బీహార్‌లో దారుణం.. ఐదుగురు కుటుంబ సభ్యులు హత్య

ఒక నెటిజన్ హార్దిక్ జాస్మిన్ పోస్ట్ చేస్తూ.. ఒకరు పోయారు, మరొకరు వచ్చారని తెలిపాడు. మరొకరు.. హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకుని నెల కూడా కాలేదు. అప్పుడే సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్. మరొక నెటిజనన్.. వివాహం అనేది హిందూ సంస్కృతి యొక్క పవిత్ర బంధం.. ఆట కాదు. తనలాంటి సెలబ్రిటీలు మతపరమైన ఆచారాలను బహిరంగంగానే ఎగతాళి చేస్తున్నారు. అని హార్ధిక్ పై ట్రోలింగ్స్ తో విరుచుకుపడుతున్నారు. మరోవైపు.. సింగర్ జాస్మిన్ వాలియాను కూడా ట్రోల్ చేస్తున్నారు.

Show comments