నెదర్లాండ్స్ లో జరిగిన ఘోర ట్రైన్ ప్రమాదంలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం తెల్లవారు జామున హేగ్ నగరానికి సమీపంలోని ఊర్ షోటెన్ గ్రామం వద్ద ఓ ప్యాసింజర్ రైలు ట్రాక్ పై ఉన్న నిర్మాణ సామగ్రిని ఢీ కొట్టడం వల్ల పట్టాలు తప్పింది. వెంటనే మొదటి బోగీ పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. రెండో బోగి పక్కకు పడిపోయింది. చివరి బోగీలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అయితే రైల్లోని వారు వెంటనే మంటలను ఆర్పివేశారు.
Read Also : Vallabhaneni Vamsi: సీఎం జగన్ సమీక్షకు డుమ్మా..! వల్లభనేని వంశీ స్పందన ఇదే..
అయితే ఈ ప్రమాద సయమంలో ప్యాసింజర్ రైల్లో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం కారణంగా లైడెన్, హేగ్ లోని ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు డచ్ రైల్వే శాఖ ట్వీట్ చేసింది.
Read Also : Vallabhaneni Vamsi: సీఎం జగన్ సమీక్షకు డుమ్మా..! వల్లభనేని వంశీ స్పందన ఇదే..
హేగ్ మరియు ఆమ్‌స్టర్‌డామ్ మధ్య ఉన్న గ్రామమైన ఊరే చోటెన్ సమీపంలో రెస్క్యూ బృందాలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్నాయని స్థానిక అత్యవసర సేవలను అందిస్తున్నాయి. అంతకుముందు ప్యాసింజర్ రైలును మరో గూడ్స్ ట్రైన్ ఢీ కొట్టిందని వార్తలొచ్చాయి. అయితే.. రెండు రైళ్లు పరస్పరం ఢీ కొనలేదని కాసేపటికి అధికారులు క్లారిటీ ఇచ్చారు. ప్రయాణికుల రైలు పట్టాలపై ఉన్న నిర్మాణ సామగ్రిని ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపాయి.