NTV Telugu Site icon

Israel: ఇజ్రాయెల్‌ సంచలన నిర్ణయం.. వార్‌ కేబినెట్‌ రద్దు

720

720

గాజాపై యుద్ధం సాగిస్తున్న వేళ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధ నిర్ణయాల్లో కీలకమైన వార్‌ కేబినెట్‌ను రద్దు చేసింది. దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వార్‌ కేబినెట్‌ను రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేతలు బెన్నీ గాంట్జ్‌, గాడీ ఐసెన్‌కోట్‌ వార్‌ కేబినెట్‌ కమిటీ నుంచి ఇటీవల బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో దానిని రద్దు చేశారు. గత ఏడాది అక్టోబరులో ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్‌ మెరుపుదాడులకు పాల్పడింది. ఇజ్రాయెలీయులను అపహరించుకునిపోయింది. ఇది పగతో రగిలిపోయిన ఇజ్రాయెల్.. ఆ నాటి నుంచి హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం సాగిస్తోంది.

ఇది కూడా చదవండి: IMD: వర్షపాతంపై ఐఎండీ కీలక ప్రకటన

హమాస్‌తో యుద్ధంలో కాల్పుల విరమణకు నెతన్యాహు సముఖంగా లేకపోవడం పట్ల అసంతృప్తితోనే వార్‌ కేబినెట్‌ నుంచి ప్రతిపక్షనేతలు బయటికి వచ్చినట్లు సమాచారం. లెబనాన్‌తో వివాదాస్పద సరిహద్దులో పరిస్థితిని శాంతింపజేయాలని కోరుతూ యూఎస్ ప్రత్యేక రాయబారి అమోస్ హోచ్‌స్టెయిన్ జెరూసలేంను సందర్శించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఇదిలా ఉంటే దక్షిణ లెబనాన్‌లోని సెలా ప్రాంతంలో హిజ్బుల్లా రాకెట్ మరియు క్షిపణి విభాగాల్లో ఒక సీనియర్ కార్యకర్తను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం తెలిపింది.

ఇది కూడా చదవండి: Beenz: శర్వానంద్ తమ్ముడి రెస్టారెంట్ రీ లాంచ్.. ఎక్కడో తెలుసా?