Site icon NTV Telugu

Shankar Daughter : నాన్న సినిమాకి పోటీగా రంగంలోకి శంకర్ కూతురు..

Director Shankar

Director Shankar

అదేంటి నాన్న సినిమాకి పోటీగా శంకర్ కూతురు రావడం ఏంటి అని షాక్ అవుతున్నారా? అయితే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. 2025లో తమిళనాడులో పొంగల్‌కు కేవలం మూడు చిత్రాలు మాత్రమే విడుదల కావాల్సి ఉంది. అజిత్ విదాముయార్చి, బాల వనగన్, శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్. అయితే చివరి క్షణంలో పొంగల్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు విదాముయార్చి చిత్రబృందం నిన్న ప్రకటించింది. నిన్న న్యూ ఇయర్ నుంచి ఈ పొంగల్ రిలీజ్ సినిమాల సంఖ్య క్రమంగా పెరిగింది. ఇప్పటికే వనగన్ – గేమ్ ఛేంజర్ పొంగల్ రేసులో ఉన్నాయి. వాటికి తోడు మరికొన్ని సినిమాలు కూడా పొంగల్ రేసులోకి దిగేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో అదితి శంకర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం నేసిప్పాయ ఈ జాబితాలో చేరింది.

READ MORE: Pinaka: ఆసక్తికరంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్నడ మూవీ ‘పినాక’ టీజర్

నటుడు మురళి తనయుడు ఆకాష్ మురళి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇది అతనికి మొదటి సినిమా. దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ అతని సరసన నటించింది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. మాస్టర్ నిర్మాత అయిన జేవియర్ బ్రిటో ఈ చిత్రాన్ని నిర్మించారు. పొంగల్ సందర్బంగా జనవరి 14న నెసిప్పాయ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది పొంగల్‌కు విడుదల కానుండగా అదే సమయంలో ఆయన కూతురు అదితి శంకర్ సినిమా కూడా రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర తండ్రీకూతుళ్ల మధ్య పోటీ అన్నట్టుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. పోటీ అనలేం కానీ ఒక కుటుంబం నుంచి రెండు సినిమాలు రావడం ఒక ఆసక్తికర పరిమాణం.

Exit mobile version