Site icon NTV Telugu

Charles Sobhraj: జైలు నుంచి బయటకు వచ్చిన బికినీ కిల్లర్

Charles Sobhraj

Charles Sobhraj

Charles Sobhraj: సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభ్ రాజ్ ఇవాళ నేపాల్ దేశంలోని సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఛార్లెస్ పోలీసు వ్యాన్‌లో నేపాల్ జైలు నుంచి బయటకు బయలుదేరాడు. జీవిత‌కాల శిక్ష ఎదుర్కొంటున్న శోభ‌రాజ్‌ను రిలీజ్ చేయాల‌ని ఆ దేశ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. శోభ‌రాజ్ ఆరోగ్యం క్షీణించింద‌ని, స‌త్ప్రవర్తన కారణంగా అతడిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. 78 ఏళ్ల శోభ‌రాజ్ జైలు నుంచి రిలీజైన‌ట్లు ఇవాళ ఓ అంత‌ర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది.

Read Also : Russia Ukraine War : రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ ?

శోభరాజ్ జైలు నుంచి విడుదల చేయాలని పిటిషన్ దాఖలు చేయగా, వృద్ధాప్యం దృష్ట్యా అతన్ని విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విడుదలైన 15 రోజుల్లోగా అతన్ని దేశం నుంచి బహిష్కరణకు కూడా కోర్టు ఆమోదం తెలిపింది. 2003లో నేపాల్‌ దేశంలో ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేశాడనే ఆరోపణలపై శోభరాజ్ అరెస్టయ్యాడు. నేపాల్ దేశ కోర్టు శోభరాజ్ కు జీవిత ఖైదు విధించింది. శోభరాజ్ తల్లిదండ్రులు వియత్నాం, ఇండియన్ లు. ఇతను ఫ్రెంచి పౌరుడని నేపాల్ పోలీసులు చెప్పారు. 78 ఏళ్ల శోభరాజ్ పలు హత్య ఘటనలకు పాల్పడ్డాడని పోలీసులు వివరించారు.

అత‌నికి పాస్‌పోర్ట్ ఇచ్చిన దేశానికి .. శోభ‌రాజ్‌ను డిపోర్ట్ చేయాల‌ని ఆ దేశ సుప్రీంకోర్టు త‌న తీర్పులో వెల్లడించింది. 2003 సెప్టెంబ‌ర్‌లో నేపాలీ పోలీసులు శోభ‌రాజ్‌ను అరెస్టు చేశారు. కాసినో రాయ‌ల్‌లో ఉన్న అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసియా, యూరోప్‌లో జ‌రిగిన అనేక నేరాల్లో శోభ‌రాజ్ నిందితుడు. సీరియ‌ల్ కిల్లర్ శోభ‌రాజ్‌ను ఫ్రాన్స్‌కు డిపోర్ట్ చేయ‌నున్నారు.

Exit mobile version