Nep vs WI: వెస్టిండీస్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో నేపాల్ సంచలన విజయం సాధించింది. షార్జాలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ఈ ఇనింగ్స్ లో ఓపెనర్ కుశాల్ భుర్తేల్ (6), ఆసిఫ్ షేక్ (3) త్వరగానే ఔటైనా.. కెప్టెన్ రోహిత్ పౌడెల్ 38 పరుగులు, కుశాల్ మల్లా 30 పరుగులు చేసి జట్టుకు ఓ మోస్తరు స్కోరును అందించారు. ఆ తర్వాత వచ్చిన గుల్సన్ ఝా (22), దీపేంద్ర సింగ్ ఐరీ (17) కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. ఇక వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 4, నవీన్ బిడైసీ 3 వికెట్లు పడగొట్టారు.
ఇక 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు ఏ దశలోనూ లక్ష్యానికి చేరుకోలేకపోయింది. ఓపెనర్ కైల్ మేయర్స్ 5 పరుగులు మాత్రమే చేసి రనౌట్ అవ్వగా, అమీర్ జంగూ (19), అకీమ్ అగస్టే (15) మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. చివరిలో అకేల్ హుసేన్ 18 పరుగులు, ఫాబియన్ అలెన్ 19 పరుగులు చేసినా.. జట్టును గెలిపించలేకపోయారు. దీంతో వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులకు పరిమితమైంది. నేపాల్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ వల్ల వెస్టిండీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. నేపాల్ తరఫున కుశాల్ భుర్తేల్ 2, దీపేంద్ర సింగ్ ఐరీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, లలిత్ రాజ్‌బన్షి, రోహిత్ పౌడెల్ లు చెరో ఒక వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన రోహిత్ పౌడెల్ (38 పరుగులు & 1 వికెట్) కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సిరీస్ లో నేపాల్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.
India vs Pakistan: అమ్మో, భారత్‌తో మ్యాచ్ అంటేనే భయమేస్తుంది.. పాక్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
