నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి రాముడి జన్మస్థలంపై చర్చను ప్రారంభించారు. రాముడు, శివుడు, విశ్వామిత్రుడు వంటి దేవతలు నేపాల్ లోనే పుట్టారని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాఠ్‌మాండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఓలి పాల్గొని ప్రసంగించారు. శ్రీరాముడు నేపాల్ లోనే జన్మించాడని పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ప్రచారం చేయడంతో దేశ ప్రజలు వెనకడుగు వేయొద్దన్నారు. “రాముడు పుట్టిన స్థలం నేపాల్‌లోనే ఉంది. అది ఇప్పటికీ అక్కడే ఉంది. కానీ మేము దీన్ని ప్రచారం చేయలేకపోతున్నాం. శివుడు, విశ్వామిత్రుడు కూడా ఇక్కడే జన్మించారు. ఈ విషయం వాల్మీకి రామయణంలో రాశారు.” అని కేపీ శర్మ ఓలి వ్యాఖ్యానించారు.
READ MORE: Chhattisgarh: మద్యం మత్తులో పోలీసులతో యువతి హల్‌చల్.. వీడియో వైరల్
శ్రీరాముడి జన్మస్థలం దక్షిణ నేపాల్‌లోని అయోధ్యాపురి అని, యూపీలోని అయోధ్య కాదని కేపీ శర్మ ఓలి 2020లో పేర్కొన్నారు. అయోధ్యపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. 2020లో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులమీదుగా ఇటీవల అత్యంత వైభవంగా భూమిపూజ జరిగిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఓలి వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్పుడు మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
READ MORE: Revanth Reddy: యూరియా సరఫరా వేగవంతం చేయండి.. కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్!
