NTV Telugu Site icon

Nepal Plane Crash: నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. 72 మంది మృతి

Nepal Plane Crash

Nepal Plane Crash

Nepal Plane Crash: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యతి ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా.. ఓ విమానం అదుపుతప్పి నదిలోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 72 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. . దేశ రాజధాని ఖాట్మాండు నుంచి బయలుదేరిన విమానం పొఖారాలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో ఫ్లైట్‌లో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని యతి ఎయిర్ లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా ప్రకటించారు. కూలిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుంది. ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఎయిర్ పోర్టును మూసేశారు. ప్రమాదంలో చాలా మంది వరకు చనిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సుమారు 72 మందితో ప్రయాణిస్తున్న విమానం పోఖారాలో కూలిపోవడంతో విమానంలోని  అందరూ ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. ఇద్దరు చిన్నారులతో సహా 10 మంది విదేశీ పౌరులు విమానంలో ఉన్నారని అని యతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు. 53 నేపాలీ, 5 భారతీయులు, 4 రష్యన్, ఒక ఐరిష్, ఇద్దరు కొరియన్లు, 1 అర్జెంటీనా, ఒక ఫ్రెంచ్ జాతీయుడు విమానంలో ఉన్నారని వెల్లడించారు. శిథిలాల వద్ద మంటలు చెలరేగడంతో రెస్క్యూ ఆపరేషన్‌లు కష్టంగా ఉన్నాయని నేపాలీ జర్నలిస్ట్ ఒకరు వెల్లడించారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు.

Read Also: Flight Crash: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం.. ప్రమాద సమయంలో ఫ్లైట్ లో 72 మంది

నేపాల్ పౌర విమానయాన అథారిటీ ప్రకారం.. విమానం ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 10:33 గంటలకు బయలుదేరింది. పోఖారా విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు దగ్గరగా ఉన్న విమానం, సేతి నది ఒడ్డున ఉన్న నది లోయలో కూలిపోయింది. టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత క్రాష్ జరిగింది. విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. రెస్క్యూ సిబ్బంది వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంతాపం తెలిపారు. “నేపాల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. నా ఆలోచనలు, ప్రార్థనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. ఓం శాంతి” అని ఆయన ట్వీట్ చేశారు.

Read Also: Army Chief: చైనా సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం..

ఇంతకుముందు నేపాల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదాల్లో వందలాది మంది మరణించారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మే 2022లో నేపాలీ క్యారియర్ తారా ఎయిర్ నడుపుతున్న విమానంలో మొత్తం 22 మంది వ్యక్తులు.. 16 మంది నేపాలీలు, నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మన్లు.. విమానం కూలిపోవడంతో మరణించారు. మార్చి 2018లో.. యూఎస్-బంగ్లా ఎయిర్‌లైన్స్ విమానం ఖాట్మండు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో క్రాష్-ల్యాండ్ అయింది. 51 మంది మరణించారు. 1992లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం ఖాట్మండుకు చేరుకునే సమయంలో కుప్పకూలినప్పుడు అందులో ఉన్న మొత్తం 167 మంది మరణించారు. కేవలం రెండు నెలల క్రితం, థాయ్ ఎయిర్‌వేస్ విమానం అదే విమానాశ్రయానికి సమీపంలో కుప్పకూలింది. 113 మంది మరణించారు.