Site icon NTV Telugu

Fuel Price Hike: షాకింగ్.. రాత్రికి రాత్రే భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు.. ఎక్కడంటే?

Petrol

Petrol

Fuel Price Hike: గత నెలగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు దక్షిణాసియా దేశాలపై పడుతోంది. అంతర్జాతీయ ముడిచమురు ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. దీంతో నేపాల్‌లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు మరోసారి పెరిగాయి. నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 15 నేపాలీ రూపాయలు పెంచింది. ఈ కొత్త ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త ధరల ప్రకారం.. కేటగిరీ 1 ప్రాంతాలలో లీటరు పెట్రోల్ ధర రూ.184.50, కేటగిరీ 2 ప్రాంతాలలో రూ.186, కేటగిరీ 3 ప్రాంతాలలో రూ.187గా ఉంది. డీజిల్, కిరోసిన్ ధరలు కేటగిరీ 1 ప్రాంతాలలో లీటరుకు రూ.164.50, కేటగిరీ 2 ప్రాంతాలలో రూ.166, కేటగిరీ 3 ప్రాంతాలలో రూ.167కు పెంచారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది.

READ MORE: Strait of Hormuz: భారత్ కు ఊరట.. హర్మూజ్ జలసంధి గుండా నౌకలు ప్రయాణించడానికి ఇరాన్ అనుమతి

గత 15 రోజుల్లో తమకు సుమారు 5 బిలియన్ల నేపాలీ రూపాయల నష్టం వాటిల్లిందని, ఈ కారణంగానే ధరల పెంపు అనివార్యమైందని ఆ కార్పొరేషన్ తెలిపింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి అందిన తాజా రేట్ల జాబితా ఆధారంగానే కొత్త ధరలను నిర్ణయించినట్లు తెలిపింది. పూర్తిగా ఆటోమేటెడ్ ధరల విధానం ప్రకారం ధరలను నిర్ణయించడం ఇంకా సాధ్యం కాదని కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. నేపాల్‌లో నెల రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈ నిరంతర ధరల పెరుగుదల ప్రజలపై, రవాణా రంగంపై, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందనే భయాలను పెంచింది.

READ MORE: Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఈరోజు అన్ని కష్టాలే!

Exit mobile version