Nepal Crisis: నేపాల్ ప్రస్తుతం తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం తర్వాత చెలరేగిన జనరల్ జెడ్ విప్లవం ప్రభుత్వాన్ని కూలదోసింది. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం కారణంగా.. నేపాల్ వీధుల్లో హింస, అల్లర్లు, అనిశ్చితి నెలకొన్నాయి. దీని అతిపెద్ద ప్రభావం ఉపాధి కోసం నేపాల్ నగరాలు, పట్టణాలకు వెళ్లి.. పనిచేస్తున్న భారతీయ కార్మికులపై పడింది. రోజు రోజుకూ పరిస్థితి దిగజారడంతో కార్మికులు భారత్ కు కాలినడకన తిరిగి రావడం ప్రారంభించారు.
READ MORE: Off The Record: కవిత అక్కడ నుంచే సొంత రాజకీయ యాత్ర మొదలవుతుందా..?
శుక్రవారం బీహార్ రాష్ట్రం బాగాహాలోని వాల్మీకినగర్ గండక్ బ్యారేజ్ చెక్‌పోస్ట్ వద్ద కార్మికుల పొడవైన క్యూలు ఉన్నాయి. వారందరూ నేపాల్ నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారత్ కు తిరిగి వచ్చిన వాళ్లు. ప్రతి కార్మికుడిని SSB జవాన్లు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే భారత్ లోకి అనుమతించారు. ఆ కార్మికుల అలసిపోయిన అడుగులు, వారి ముఖాల్లో కనిపించే భయం అక్కడిని పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. కొందరు చేతిలో చిన్న బ్యాగ్ ను పట్టుకుని నిస్సాయంగా నడుస్తూ వస్తున్నారు. మరికొందరు తమ పిల్లను చంకనేసుకుని సొంత దేశానికి చేరుకున్నారు. మహిళలు, వృద్ధులు కూడా కాలినడకన తిరిగి రావాల్సి వచ్చింది.
READ MORE: Crypto Currency Scam: నకిలీ క్రిప్టో కరెన్సీ కేసులో మాజీ కార్పొరేటర్ అరెస్ట్.. ఏ పార్టీ అంటే..?
ఈ సందర్భంగా కొందరు కార్మికులు జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. తాము నేపాల్ లోని బుత్వాల్‌లో పనిచేస్తున్నామని చెప్పారు. అక్కడ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని.. తమ వేతనాలు ఆగిపోయాయని తెలిపారు. ఆహార కొరత తీవ్రంగా ఏర్పడిందని.. చాలా రోజులుగా తమకు సరైన ఆహారం దొరకలేదని వాపోయారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో కాలినడకన సరిహద్దుకు చేరుకున్నామని అలసిపోయిన స్వరంతో చెప్పారు. ఈ కార్మికుల దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా దారిలో ఖర్చయింది. చాలా మంది ఖాళీ కడుపులతో నడవాల్సి వచ్చింది. మహిళలు, పిల్లల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. సరిహద్దుకు చేరుకున్న వెంటనే కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు.
